వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన లడాయి: లగడపాటికి దిగ్విజయ్ బుజ్జగింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్టానాన్ని కూడా ప్రశ్నిస్తున్న విజయవాడ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను బుజ్జగించడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విభజన వ్యవహారంలో మీరు ఒంటరి అయ్యారని, అందరూ ఏదో రకంగా మధ్యమార్గం అవలంబిస్తున్నారని, మీరు అనవసరంగా అనవసరంగా తెలంగాణను వ్యతిరేకించి అధిష్టానంతో కయ్యానికి దిగుతున్నారని దిగ్విజయ్ సింగ్ లగడపాటి రాజగోపాల్‌తో అన్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి.

బుధవారం మధ్యాహ్నం లక్నోలో ఉన్న దిగ్విజయ్ లగడపాటిని అక్కడికి పిలిపించుకుని, సర్దిచెప్పేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తెలంగాణ నిర్ణయాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న తీరు అధిష్ఠానం దృష్టిలో పడిందని, కేంద్రమంత్రులతో సహా అనేక మంది ఇతర నేతలు రకరకాల ప్రతిపాదనలు చేస్తుండగా, లగడపాటి ఒక్కరే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది.

సమైక్యం గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలునని, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కీలక బాధ్యతలు అప్పజెబుతామని దిగ్విజయ్ లగడపాటికి చెప్పినట్లు సమాచారం. తాను సైద్ధాంతికంగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, ఇప్పుడు ఆ వైఖరి మార్చుకోలేనని లగడపాటి చెప్పారని వార్తాకథనాల సారాంశం.

తనకు కూడా విభజన జరగడం ఇష్టం లేదని, మధ్యప్రదేశ్‌లో విభజనతో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో తనకు తెలుసునని, అయినా, నేను వ్యక్తిగతంగా ఏమీ చేయలేనని దిగ్విజయ్ సింగ్ లగడపాటితో అన్నట్లు తెలుస్తోంది. మేడమ్ సోనియాగాంధీ, పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనమంతా కలిసికట్టుగా అమలు చేయాల్సిందే కదా అని కూడా దిగ్విజయ్ అన్నట్లు చెబుతున్నారు. అయితే, వెనక్కి తగ్గడానికి లగడపాటి ఇష్టపడలేదని అంటున్నారు.

English summary

 According to media reports - Congress Andhra Pradesh affairs incharge Digvijay Singh has tried to pacify Vijayawada MP Lagadapati Rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X