కిరణ్‌కు టి రావడం ఇష్టంలేదు, బాప్‌కా జాగీరా: దినేష్‌రెడ్డి

Dinesh Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రావడం ఇష్టం లేదని మాజీ డిజిపి దినేష్ రెడ్డి మంగళవారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని చెప్పమన్నారని ఆరోపించారు. డిజిపిగా పొడిగింపు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదే అనుకుంటున్నానని చెప్పారు. జూలై 30న తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటనకు ముందు సీమాంధ్రలో బలగాలను మోహరించడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదన్నారు.

అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రి తనపై కక్ష తీర్చుకుంటే ఎదుర్కొనే శక్తి తనకు ఉందన్నారు. కక్ష తీర్చుకునేందుకు ఇది ఎవ్వరి బాప్ కా జాగీర్ కాదన్నారు. కిరణ్ పైన తాను చేస్తున్న ఆరోపణలకు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని దినేష్ రెడ్డి చెప్పారు.

ముఖ్యమంత్రి పైన దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కిరణ్ తనపై కుట్ర పన్ని పదవి పోయేలా చేశారని, అనంతపురం ఎస్పీ బదలీకి తాను అంగీకరించలేదని చెప్పారు. అలాగే సీమాంధ్ర న్యాయవాదుల సమావేశానికి తాను అనుమతి ఇవ్వకపోవడం కూడా ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించిందన్నారు. తనకు కిరణ్ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు.

రిటైర్మెంటుకు రెండు రోజుల ముందు జివోను విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ మాటను తాను విననందుకే తన పదవిని పొడిగించలేదని ధ్వజమెత్తారు. పోలీసు శాఖ ప్రమోషన్లు అన్ని సిఎం పేషీలోనే అని ఆరోపించారు. కిరణ్ వ్యక్తిగత అజెండాతో వెళ్తున్నారని నిప్పులు చెరిగారు.

కిరణ్ సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. సిబిఐ కేసును బూచీగా చూపి తనపై కుట్ర చేశారన్నారు. ఆయన మాట విననందుకే తన పదవీ కాలాన్ని పొడిగించలేదన్నారు. తనపై కుట్ర పన్ని తొలగించారన్నారు. ఎందుకు కుట్ర పన్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య పెరుగుతుందని చెప్పమన్నారని, భూదందాలకు సహకరించాని కిరణ్ తమ్ముడు తనను బెదిరించారని ఆరోపించారు. అతని భూదందాలు అడ్డుకున్నందుకే తనపై కుట్ర పన్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+