బోయపాటి సినిమాను వదులుకున్న పవన్ కల్యాణ్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమతోపాటు అన్ని భాషల పరిశ్రమల్లో అరుదైన కాంబినేషన్లు రూపుదిద్దుకుంటాయి. అభిమానుల అంచనాలను అందుకునేలా.. అన్నివర్గాల ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేలా ఇవి రూపుదిద్దుకుంటుంటాయి. అలాగే తెలుగులో డైరెక్టర్ బోయపాటి శ్రీను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీసుకురావాలని ఎంతోమంది నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ కథ కుదరకపోవడంవల్ల ఇప్పటికీ సినిమా రాలేదు.
పవన్ కల్యాణ్ ను ఊర మాస్ క్యారెక్టర్ లో చూడాలని పవన్ అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. ఆ సమయంలోనే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసింది. గబ్బర్ సింగ్ తర్వాత డీవీవీ బ్యానరులో సినిమా చేయడానికి పవన్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ తరుణంలో బోయపాటి దగ్గర మంచి కథ ఉందని తెలియడంతో దానయ్య బోయపాటిని పిలిచి మాట్లాడారు.

బోయపాటి పవన్ కళ్యాణ్ ని కలిసి కథ ను వినిపించడం కూడా అయింది. అయితే పవన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఆ కథ లేదని, కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకురమ్మని దానయ్య, పవన్ బోయపాటిని కోరారు. ఆ తర్వాత కథలో మార్పులు చేర్పులు చేసి మరోసారి పవన్ కు బోయపాటి వినిపించాడు. అయితే ఎందుకో ఆ మాస్ కథ పవన్ కల్యాణ్ కు నచ్చలేదు. తన నిర్ణయాన్ని తర్వాత చెబుతాను అన్నారు.
అదే సమయంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేముందే పవన్ కల్యాణ్ బోయపాటికి ఫోన్ చేసి కథ నచ్చిందికానీ ఎందుకో అలాంటి కథ తనకు సెట్ అవదనిపిస్తోందని, బాలయ్యగారికైతే బాగా సరిపోతుందని చెప్పారు. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కథ రాయాలని కోరారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికీ సెట్ అవ్వలేదు.












Click it and Unblock the Notifications