ఈ వేసవి నిప్పుల కుంపటే - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

వేసవి తీవ్రత ఆ సారి ముందే మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిస్తోంది.

వేసవి తీవ్రత ఆ సారి ముందే మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిస్తోంది. మార్చిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అలర్ట్ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాలు ప్రభావం కూడా అధికంగానే ఉంటుందని అంచనా వేసింది. వచ్చే నెలలు మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో..ముందుగానే సూచనలు జారీ అవుతున్నాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అసాధరణంగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు మొదలైయ్యాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. దీంతో గతేడాది మార్చి నెల ఆరంభంలో ఎండలు మొదలైతే ... ఈసారి ఫిబ్రవరినుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా సాధారణం కన్నా మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మార్చిలో 45 డిగ్రీల సెల్సియస్

మార్చిలో 45 డిగ్రీల సెల్సియస్


ఈసారి మార్చి మొదటివారంలోనే ఎండల తీవ్రత అధికమైంది. రెండు రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒంగోలులో బుధ, గురువారాల్లో 33డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా శుక్రవారం ఏకంగా 36 డిగ్రీలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలపై విపత్తుల శాఖ అలర్ట్స్ జారీ చేసింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాలుల ప్రభావం కూడా ఎక్కువ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. కూలీలు ఉదయం పూటే పనులు పూర్తి చేసుకొని మధ్నాహ్నానికి ఇళ్లకు చేరుకోవాలని పేర్కొంది. గర్భిణులు..బాలింతలు..చిన్న పిల్లలు..సీనియర్ సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది.

జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు

జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు


ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించింది. డీ హైడ్రేషన్ నుంచి బయటపడేందుకు తగిన మోతాదులో పానీయాలు తీసుకోవటం అవసరని పేర్కొంది. ఇంట్లో తయారు చేసుకున్న లస్సీ, ఓరల్ డీ హైడ్రేషన్ ద్రావరణం, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తాగాలని విపత్తుల శాఖ సూచిస్తోంది. అన్ని జిల్లాల యంత్రాంగాలకు అధిక ఉష్ణోగ్రతలు..వడగాలులపై నాలుగు రోజుల ముందే సూచనలు జారీ చేస్తామని విపత్తుల శాఖ స్పష్టం చేసింది. రానున్న రెండు నెలలు ఏప్రిల్..మే నెలల్లో వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండకపోతే సమస్యలు తప్పవని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+