ఏపీలో దంచికొట్టిన వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ.. మరో వైపు అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. నాలుగు రోజులు గా అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం సమయానికి జల్లులు.. వర్షాలు కోస్తా - సీమ జిల్లా ల్లో మొదలవుతున్నాయి. కాగా, రానున్న అయిదు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కొన సాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వడ గాల్పుల పైన అప్రమత్తం చేస్తున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. ఉదయం వేళ పలు ప్రాంతా ల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా , ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38-42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు దంచికొట్టాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజ్ కాలువలు పొంగి రోడ్లలో ప్రవహించాయి.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒక్కసారిగా పెను గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూ లిపోయాయి. వైర్లు ధ్వంసం అవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమా రు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో అన్నదాతలు నష్టపోయారు. కళ్లాల్లోని వరి, ధాన్యం వర్షానికి తడిచింది. ఈదురుగాలకు బొప్పాయి, అరటి తోటలు దెబ్బతినగా పలు చోట్ల మామిడి తోటలో కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వేసవి కాలంలో ఈ మాదిరిగా వర్షం పడటమేంటని ప్రజలు ఆందోళన చెందుతున్ నారు. వర్షం ఈ మాదిరిగా కురవడంతో ఇంకా ఎండలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications