ఏపీలో జల గణపతి- కిరీటం మాత్రమే చూడగలం
చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం వినాయకుడి గురించి తెలియనివారుండరు. గణేషుడు స్వయంభూవుగా బావిలో వెలిసిన ఆలయం ఇది. ఏటా కోట్లమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుంటారు. రాష్ట్రంలో ఉన్న తొలి 10 ఆలయాల్లో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గుడి కూడా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే మెజారిటీ భక్తులు.. కాణిపాకం ఆలయాన్నీ సందర్శిస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది.
ఏపీలో మరో స్వయం భూ వినాయక స్వామి ఆలయం ఉంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఇలాంటి ఆలయమే వెలిసింది. ఇక్కడ కూడా వినాయకుడు స్వయంభూగా బావిలో వెలిశాడు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. స్వయంగా భూమి నుండి పుట్టిన రాతి విగ్రహం విఘ్నేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి పొందింది. కాణిపాకం తర్వాత స్వయంభూగా వెలిసిన ఆలయం ఇదొక్కటే. ఎంటువంటి కార్యాలైన స్వామిని దర్శించుకుని వెళ్తే శుభం జరుగుతుందని, స్థానికులు నమ్ముతారు.

ఇక్కడి విఘ్నేశ్వరుడి విగ్రహం ప్రతి ఏడాది పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సుమారు 90 సంవత్సరల కిందట ముప్పావు కేజీ వెండితో స్వామివారికి కిరీటం చేయించగా.. ఇప్పుడు అదే కిరీటాన్ని తయారు చేయడానికి రెండు కేజీలతో వెండిని ఉపయోగించాల్సి వచ్చిందని భక్తులు చెప్పారు. మొంథా తుఫాన్ వల్ల సంభవించిన భారీ వర్షాల వల్ల గర్భగుడి నీటితో మునిగిపోయింది. స్వామివారు జల గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఇక్కడ ఉన్న శివాలయం, వినాయక స్వామి ఆలయాల్లో నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ వెలిసిన శివయ్యను గంగా సమేత శ్రీ గౌరీశ్వర స్వామిగా కొలుస్తారు. అలాగే విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో నీరు ఊరుతుంది. ఇక వర్షాకాలంలో స్వామివారు శిరస్సు మాత్రమే బయటకు కనిపిస్తుంది. ఆలయంలో కొడమంచిలి వంశీయులు ఆధ్వర్యంలో పూర్వం నుండి అర్చకత్వం చేస్తోన్నారు. బాలగణపతి సంఘం ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చెందింది. ఇప్పుడు దేవదాయశాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications