Billionaires: తెలుగు రాష్ట్రాల బిలియనీర్లు వీళ్లే..
మంగళవారం 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 105 స్థానం దక్కించుకున్నారు. దేశంలో అత్యంత సంపన్నుడిగా ముఖేశ్ అంబానీ నిలిచారు. తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ, సైరస్ పునావాలా, శివ్ నాడార్, గోపిచంద్ హిందూజా, దిలీప్ సంఘ్వి, లక్ష్మి మిట్టల్, రాధా కిషన్ దమానీ, కుమార మంగళం బిర్లా, నీరజ్ బజాజ్ ఉన్నారు. ఇక ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు మహిళలతో పాటు 105 మంది జబితాలో నిలిచారు.
105 మంది సంపద విలువ 33 శాతం పెరిగి రూ.5.23 లక్షలకు చేరింది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 బిలియనీర్లు ఉన్నారు. మురళి దివీ రూ.55,700 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ పచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో తెలుగు రాష్ట్రాల నుంచి రెండో స్థానంలో ఉన్నారు. 105 మందిలో హైదరాబాద్ కు చెందిన వారు 87 మంది ఉన్నారు. అయితే ఇందులో ఎక్కువగా ఆంధ్రా సెటిలర్లు ఉన్నారు. టాప్-20లోని మనోజ్ నంబూరు, ప్రవీణ్ కుమార్‌లతో పాటు జి రవీంద్ర రావు, ఎన్ విశ్వేశ్వర రెడ్డి, కుటుంబం, సజ్జ కిశోర్ బాబు, కుటుంబం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జాబితాలో తొలిసారిగా చోటు దక్కింది.

గతేడాది గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉండే వాడు. కానీ హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ ఆస్తుల విలువ పడిపోయింది. అదానీ సంపద 57% క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో ఆయన రెండో స్థానానికి పడిపోయారు. దేశ బిలీయనిర్లలో ఉత్తరాది వారే ఎక్కువ మంది ఉన్నారు.












Click it and Unblock the Notifications