నా రాజాను వదిలి ఉండలేక బిగ్ బాస్ ఆఫర్ వదులుకున్నా ..!

బిగ్‌ బాస్ సీజన్ 9 ప్రారంభానికి ముందు నుంచే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండవ భార్య దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే సీజన్ ప్రారంభమైనా ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి స్పష్టతనిచ్చారు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన మాట నిజమేనని, అయితే ఒక ముఖ్యమైన కారణం వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఆమె తెలిపారు.

"నా రాజాను వదిలి నేను ఉండలేను. అందుకే బిగ్‌బాస్ అవకాశం వచ్చినా వదులుకున్నా" అని ఆమె భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు తన భర్తతోనే సమయం గడుపుతానని, ఆయనకు వండిపెట్టడం, చూసుకోవడం తనకు ఎంతో ఇష్టమని అన్నారు. రాజకీయ పర్యటనలు, టూర్ల కోసం నెలకు పది రోజులు ఆయనతో కలిసి ప్రయాణిస్తానని తెలిపారు. ఇద్దరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, అందుకే తరచుగా ట్రిప్‌లకు వెళ్తామని చెప్పారు.

Divvela Madhuri Reveals Why She Rejected Bigg Boss Offer Can t Live Without My Raja

లేటు వయసులో వీరి ప్రేమ, పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దువ్వాడ శ్రీనివాస్ తన మొదటి భార్య, పిల్లలకు దూరమై దివ్వెల మాధురితో కలిసి రీల్స్, వీడియోలు చేయడం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. గతంలో మాధురి చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా వైరల్ అవ్వడంతో ఆమె తక్కువ సమయంలోనే సోషల్ మీడియా స్టార్‌గా మారారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తన భర్తపై మాధురికి ఉన్న ప్రేమ, ఆయనను వదిలి ఉండలేకపోవడం బిగ్‌బాస్ లాంటి పెద్ద అవకాశాన్ని వదులుకునేలా చేసిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+