అవినీతి పేదలను తినేస్తోంది- చంద్రబాబును అందుకే ఓడించారు : జగన్ సైతం- డీఎల్ సంచలనం..!!
మరోసారి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 2019 ఎన్నికల సమయంలో మైదుకూరు సభలో డీఎల్ మెడలో జగన్ వైసీపీ కండువా కప్పారు. కానీ, పార్టీ పరంగా ఆయన యాక్టివ్ గా ఎక్కడా కార్యక్రమాల్లో పొల్గొనలేదు. కొంత కాలంగా ముఖ్యమంత్రి లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను వైసీపీలోకి ఆహ్వానించరంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా రెండున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓట్లు వేసిన ప్రజలు ఓడిపోయారంటూ కామెంట్ చేసారు. ప్రతి పథకం కు జగన్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చెడగొడుతున్నారని ఆరోపించారు.

జగన్ తూట్లు పొడుస్తున్నారంటూ
అభయహస్తం పథకానికి జగన్ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. సెర్ఫ్ సీఈఓ రద్దయింది అని చెప్పారన్నారు. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాన్ని రద్దు చేసిన మీరు ఎందుకు పథకాలకు ఆయన పేరు పెట్టడమని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా వచ్చిన డబ్బులు మళ్ళీ యాజమాన్యాలకు కట్టకుంటే ..పెన్షన్ ఇవ్వమని చెప్పడం సమంజసమా అని నిలదీసారు. ఆరోగ్య శ్రీ పథకం, జబ్బులు సంఖ్య పెంచిన ప్రయోజనం లేదని డీఎల్ వ్యాఖ్యానించారు. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం రాజశేఖర్ రెడ్డి ఆ పథకం పెట్టారని గుర్తు చేసారు.

పధకాలు నిర్వీర్యం అవుతున్నాయి
విద్యా దీవెన లాంటి ఎన్నో పథకాలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. నవారత్నాలు పేరుతో లబ్దిదారులను ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తుందని ఫైర్ అయ్యారు. జగనన్న శాశ్వత గృహ నిర్మాణ పథకం లో 10,000 కట్టకుంటే పెన్షన్ తీసేస్తాం అన్నారని విమర్శించారు. గ్రామాలలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చేలా ఉన్నాయని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రద్దు చేయాలని కోరారు. ఆర్దికంగా రాష్ట్రం దివాలా తీసేలా ఉందని వ్యాఖ్యానించారు. అధికారులు ఎందుకు ఇంతలా దిగజారడమంటూ ప్రశ్నించారు. జగన్ ఏది చెప్తే అది తలా ఊపి సంతకం పెట్టడం ఏంటని డీఎల్ నిలదీసారు.

రాష్ట్రంలో పెట్టుబడులు లేవు
రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని చెప్పుకొచ్చారు. రైతుల నుండి వరి కొనే పరిస్థితి లేదని.. కేంద్రాలు ఎక్కడున్నాయో రైతులకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. ధరల స్థిరీకరణ నిది ఏమైందని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. 95100 రూపాయల తో ఇండ్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే డబ్బు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగలేదని లెక్కలు చెప్పుకొచ్చారు. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో అయిన రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పారు.

అవినీతి కారణంగానే చంద్రబాబు ఓటమి
అవినీతి వల్లే చంద్రబాబు ఓడి పోయారని.. దిగువ స్థాయి లో అవినీతి అదుపు చేయాలని సూచించారు. అవినీతి పేద ప్రజలను తినేస్తుందన్నారు. నవీన్ పట్నాయక్ అవినీతి అధికారులను తొలగించి అయిదు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. తాను ఎవరి దృష్టికి తీసుకెళ్దాం అన్నా అప్పాయింట్ మెంట్ ఇవ్వటం లేదని పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్ అవలంబించే పద్ధతులు పాటిస్తే మరో మారు అధికారం కు వస్తారన్నారు. రాజశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువ పెరు సంపాదిస్తానన్న జగన్ ఆయన పెట్టిన పథకాలు తీసేస్తున్నారని విమర్శించారు. మైదుకూరులో రఘురాం రెడ్డి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదని.. ఓట్ల కోసం వెళితే ప్రజలు తిరగబడి కొడతారంటూ డీఎల్ ఘాటు వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications