టిడిపి కార్యాలయానికి డిఎల్: అభ్యర్థుల కసరత్తు

తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై ఆయన సోమవారం మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ సైకో అని, అలాంటి వారికి చెక్ పెట్టాలంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతివ్వాలని ఆయన అన్నారు. అపుడే సీమాంధ్రను స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా మార్చుకోగలమన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తమ నియోజకవర్గంలోని 15 ఎంపిటిసి స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుని కార్యర్తలు సత్తాచాటాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని అనుచరులు, కార్యకర్తలతో చర్చించారు.
అంతేకాకుండా తాను తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇస్తానని డిఎల్ చెప్పారు. ఇదే అంశంపై స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications