కడపలో దద్దమ్మలకు ఓటు వేస్తారా ? వైఎస్ షర్మిలకు, సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యండి, డీఎల్ రెడ్డి !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే రోజులు జరుగుతున్న సందర్బంగా నాయకులు తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలె ఉన్న వైసీపీ, ప్రతిపక్ష పార్టీల కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయులు ఎవరికి వాళ్లు ఎన్నికల ప్రచారం చేస్తూ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్న సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పొత్తులో భాగంలో సీట్లు పంచుకుని పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్ల తరువాత వైఎస్ షర్మిలను ముందు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో అనే విషయం ఆ దేవుడకే తెలియాలి.

DL Ravindra Reddy told YS Sharmila in Kadapa that MLA s vote should be marked by bicycle

ఈ సందర్బంలో వైసీపీ నాయకులు లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సైకిల్ గుర్తుకు, జనసేన గాజుగ్లాస్ గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్తం గుర్తుకు ఓటు వెయ్యాలి అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇదే సందర్బంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని వెలుగు చూసింది.

ఈ సందర్బంలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప లోక్ సభ నియోజక వర్గం వైఎస్ఆర్ సీ పీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఓ నిందితుడు అని, అవినాష్ రెడ్డిని మీరు మరోసారి గెలిపించినా అతనికి ఏపని చేతకాదని, అందుకని కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలకు ఓటు వెయ్యాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి బహిరంగంగా ప్రజలకు మనవి చేస్తున్నారు.

కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు వైఎస్ షర్మిలకు ఓటు వెయ్యడం ఎంతో మేలు అని మాజీ మంత్రి డీఎల్ రవింద్రా రెడ్డి కడప ఓటర్లకు మనవి చేశారు. వైఎస్ఆర్ వారసురాలు పార్లమెంట్ లో అడుగుపెడితే కనీసం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోందని, ఈ దద్దమ్మలను గెలిపిస్తే ఏపని చేతకాదని డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

DL Ravindra Reddy told YS Sharmila in Kadapa that MLA s vote should be marked by bicycle

లోక్ సభ ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ వారసురాలు వైఎస్ షర్మిలకు ఓటు వెయ్యాలని, మైదకూరు అసెంబ్లీ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపుకోసం పని చెయ్యాలని డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైదకూరులో సైకిల్ గుర్తుకు అందరూ ఓటు వెయ్యాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఎన్నికల ప్రచారం చెయ్యడం కలకలం రేపింది.

మైదకూరు నియోజక వర్గం ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టా సుధాకర్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన ఎమ్మెల్యే అయితే మీకే మంచిది అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఎన్నికల ప్రచారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి స్వయంగా ప్రజలకు క్రాస్ ఓటింగ్ కు పాల్పడాలని చెప్పడంతో ఆ ప్రాంతంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+