మార్క్ శంకర్ పై డాక్టర్ల బిగ్ అప్డేట్ - ఆస్పత్రిలో పవన్, షిఫ్టింగ్..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ వైద్యులు వెల్లడించారు. సింగపూర్ లో గాయపడిన మార్క్ శంకర్ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ హుటాహుటిన సింగపూర్ కు వెళ్లారు. చిరంజీవి, సురేఖ దంపతులు సింగపూర్ లో మార్క్ శంకర్ ను పరామర్శించారు. వైద్యులతో చర్చించారు. ఆస్పత్రిలోనే ఉన్న పవన్ తాజా చికిత్స పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఈ సమయంలో కీలక సూచనలు చేసారు. మార్క్ శంకర్ ఆరోగ్యం పైన ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.
మార్క్ హెల్త్ బులెటిన్
డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగు తోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ గారు నేరుగా ఆసు పత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న తనయుడు మార్క్ ను చూసారు. మార్క్ ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులతో చర్చించారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరి తిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్య పరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని పవన్ కు వైద్యులు వివరించారు.

ఐసీయూ నుంచి గదికి మార్పు
తాజాగా, కొద్ది సేపటి క్రితం మార్క్ ను అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు. సింగపూర్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులో మూడు అంతస్థుల భవనం ఉంది. అందులో పలు దుకాణాలతోపాటు.. చిన్నారులకు రోబోటిక్ ఇనిస్టిట్యూట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే 30 మంది స్కూల్ పిల్లలకు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వారిలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు రాజుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై సమాచారం అందగానే సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం హుటాహుటిన స్పందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
మరో నాలుగు రోజులు
ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. అయితే.. సహాయక చర్యలు చేపట్టే సమయానికే 10 ఏళ్ల బాలిక మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్టు మంత్రి తెలిపారు. మంగళవారం రాత్రి 9:30 గంటలకు సింగపూర్ బయల్దేరి వెళ్లారు. పవన్ తో పాటుగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ సింగపూర్‌కు బయల్దేరారు. మార్క్ శంకర్ ఆరోగ్యం కోలుకుంటున్నారని.. ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు పవన్ అక్కడే కుమారుడు కోసం ఉండాలని నిర్ణయించారు. మార్క్ పూర్తిగా కోలుకునే వరకూ పవన్ అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిశ్చార్జ్ తరువాతనే పవన్ తిరిగి ఏపీకి వస్తారని సమాచారం.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications