2019లో పవన్ నిర్ణయిస్తాడా..? శాసిస్తాడా..?
Recommended Video

2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ ఆంద్రప్రదేశ్ లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్న జనసేనాని ప్రజలకు న్యాయం చేయడంలో ఎందుకు విఫలం చెందుతున్నారంటూ ప్రశ్రిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఉత్తరాంద్రతో పాటు కోస్తాలో పర్చటిస్తున్న పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు. పవన్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ పట్ల ఆకర్షితులవుతున్న నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోమాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ అతని కుమారు ముత్తా శశిధర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. వీరు చేరికతో తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు కోస్తాలో రాజకీయ సమీకరణాలు పవన్ కు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

టీడీపిని, బీజేపీని టార్గెట్ చేస్తున్న పవన్..! ఆ పార్టీలకు ప్రమాదకంగా మారతాడా..?
పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర రాజకీయ ప్రకంపనలను స్రుష్టిస్తోంది. అదికార ప్రతిపక్ష పార్టీలపైన దనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపుకు అందరూ శ్రమించాలని పిలుపునిచ్చారు జనసేనాని. పవన్ కళ్యాన్ మాటల తూటాలకు కోస్తా పర్యటనలో పదును పెంచారు. మిస్సైల్ లాంటి మాటలతో అదికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టి చంద్ర బాబు పై సంధిస్తున్నారు. పదునైన పదజాలంతో ప్రతిపక్షాన్ని కకావికలం చేస్తున్నారు. కేంద్ర కమలనాథులను సైతం కసి తీరా కడిగేస్తున్నారు. మొత్తానికి జనసేన పోరాట యాత్ర లో అన్నీ తానై ప్రజలకు న్యాయం చేసే నేతగా నిలబడతాను తప్ప మోసం మాత్రం చేయనంటూ ప్రజాక్షేత్రంలో పయనం కొనసాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్.

2014లో ఊహించని మలుపు..! పవన్ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న ఉన్న క్రేజ్ అంచనా వేయడం కష్టం. అటువంటి నేత 2014లో టీడీపీ పక్కన నిలబడి ప్రచారానికి వెళితే.. యువత బాగానే స్పందించారు. చంద్రబాబునాయుడు కావాలని భావిస్తున్న సమయంలో తన మనసులో మాట కూడా అదేనంటూ జగన్ వంటి అవినీతిపరుడు సీఎం కాకూడదనే విషయాన్ని పవన్ కూడా యువతలో బాగానే ఎక్కించారు. ఫలితంగా జగన్ అధికార పీఠానికి దూరమయ్యాడు. ఇప్పుడు పవన్‌విమర్శలతో టీడీపీ నేతలు గెలుపు వెనుక మా కష్టమేనంటున్నారు. వాస్తవానికి దానిలో ఎంతో కొంత పవన్ ప్రమేయం ఉందనేది జగమెరిగిన వాస్తవం.

పవన్ ఛరిష్మా ప్రభావం చూపుతుందా..?
2019లో జనసేనాని, వామపక్షాలతో కలసి పోటీకి దిగబోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పవన్ ఇమేజ్.. తటస్థ ఓటర్ల కొంతమేర పవన్ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది వాస్తవం. అయితే.. అది ఎన్నిసీట్లు తెప్పిస్తుంది. ఎన్నిచోట్ల గెలిపిస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ.. తప్పనిసరిగా 30-40 అసెంబ్లీ సీట్లయినా గెలుచుకుంటారనేది జనసేన అంచనా. మరీ అదృష్టం వరించి.. జనం ఒక్కసారి అవకాశం ఇద్దామనుకుంటే ఏకంగా సీఎం పీఠమే దక్కవచ్చనేది విశ్లేషకుల వాదన కూడా.

పవన్ కింగా ..! కింగ్ మేకరా..! 2019లో అదే ఉత్కంఠ..!
అయితే దీనివెనుక మరో భిన్నాభిప్రాయంకూడా ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చి బరిలో నిలబడి, ప్రత్యర్థులతో తలబడి పవర్‌లోకి వచ్చేంత పరిస్థితుల్లేవు. పైగా ఇది 1982 కాదు.. 2019 టీడీపీ బలంగా ఉంది.. వైసీపీ కూడా ధీమాగా ఉంది.. కాంగ్రెస్ బలపడి.. గట్టి పోటీనిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటువంటి విపత్కర సమయంలో పవర్ సంగతి ఎలా వున్నా.. కర్ణాటకలో ఏర్పడినట్లుగా.. కింగ్‌మేకర్‌గా మాత్రమే పవన్ చక్రం తిప్పవచ్చనే వాదన బలంగా వినిపిస్తుంది. మరి.. పవన్ మనసులో మాట నెరవేరుతుందా! కన్నడీయుల తీర్పు.. ఏపీలో పునరావృతమవుతుందా! ఏమో.. రాజకీయాలు కదా! ఏదైనా జరగవచ్చు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications