జగన్ కారు కింద పడే వృద్ధుడి మృతి ? వెలుగులోకి సంచలన వీడియో..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్లలో విగ్రహావిష్కరణకు వచ్చిన సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అందులో అనుమతి లేని ఓ వైసీపీ నేత కారు ఢీకొనడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ముందుగా పోలీసులు వెల్లడించారు. అయితే అది నిజం కాదని తాజాగా జరిగిన విచారణలో తేల్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగన్ రెంటపాళ్ల పర్యటనకు వచ్చిన సమయంలో భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో జగన్ మధ్యలో కారు ఆపి వారిని పలకరించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కారు ఆగక ముందే ఓ వృద్ధుడు చక్రాల కింద పడి నలిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఆధారంగా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇప్పటివరకు సింగయ్యను జగన్ కాన్వాయ్‌లో ఉన్న ఓ అనధికారిక వైఎస్సార్సీపీ నేత వాహనం ఢీ కొట్టినట్లు భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజా వీడియోతో దర్యాప్తులో మార్పులు చేయబోతున్నారు. ఏటుకూరు వద్ద నేషనల్ హైవే నుంచి సర్వీసు రోడ్డులోకి మలుపు తిరిగే ప్రదేశంలో జగన్ వాహనం కింద సింగయ్య పడిపోయినట్టు కొందరు కార్యకర్తలు గమనించి ఆపాలని డ్రైవర్‌కు సైగ చేసినట్టు తెలుస్తోంది.
Proof that @ysjagan's own vehicle killed a man. #YSJaganAMurderer pic.twitter.com/876kXBemnm
— Srivalli (@srivalli2000) June 22, 2025
వీటి ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఆ కారు జగన్ దేనని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసుల తదుపరి చర్యలేంటన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ పై విమర్శలు మొదలుపెట్టేశారు. జగన్ ఉద్దేశపూర్వకంగా పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా వృద్థుడి ప్రాణాలు తీశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications