హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిచ్చి పిచ్చిగా కరుస్తున్న కుక్కలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో కుక్కలు రెచ్చిపోతున్నాయి. శునకాలు స్వైర విహారం చేస్తూ అందినవారిని అందినట్లు కరిచేస్తున్నాయి. ఆదివారంనాడు ఆడుకుంటుండగా మల్లేపల్లి ఆసిఫ్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్రాన్‌పై కుక్క దాడి చేసి కరిచింది.

అదే ప్రాంతంలోని ఫిల్కానాకు చెదిన మహ్మద్ ఆజం (10)పై కూడా గ్రామసింహం దాడి చేసింది. ఆదివారంనాడు ఒక్క రోజే నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి 23 మంది చికిత్స కోసం వచ్చారు నగరంలో ప్రతి రోజూ ఇలాంటి సంఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.

నిరుడు ఫీవర్ ఆస్పత్రిలో 11,671 కుక్క కాటు కేసులను నమోదు కాదు, 23 మంది రైబిస్ వ్యాధి సోకినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు 5,988 కుక్క కాటు కేసులు నమోదయ్యా.ి ఇందులో దాదాపు 11 మంది రేబిస్ వ్యాధిన పడినట్లు చెబుతున్నారు.

కుక్కకాటుకు విలవిల...

కుక్కకాటుకు విలవిల...

కుక్కకాటుకు గురై ఓ మహిళ హైదరాబాదులోని నల్లకుంటలో గల ఫీవర్ ఆస్పత్రికి విలవిలలాడుతూ వచ్చింది.

ఫీవర్ ఆస్పత్రికి కేసులు...

ఫీవర్ ఆస్పత్రికి కేసులు...

కుక్కల కాట్లకు గురై హైదరాబాదులోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇలా వైద్యం కోసం ఎదురు చూస్తూ..

కుక్క కాటుకు ఇలా..

కుక్క కాటుకు ఇలా..

ఇంటి ముందో, వీధిలోనో ఆడుకుంటున్న పిల్లలపై శునకాలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఇటీవలి కాలంలో హైదరాబాదులో పెరుగుతున్నాయి.

అభం శుభం తెలియని బాలుడు

అభం శుభం తెలియని బాలుడు

ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లవాడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతను బాధను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.

English summary
Dog bite cases are increasing in Hyderabad. on sunday itself three cases reported 23 cases at Nallakunta fever hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X