స్వామి వారి సేవకు రేపటి నుంచి: డాలర్ శేషాద్రి
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకు రేపటి నుంచి అంకితమవుతానని టీటీడీ డాలర్ శేషాద్రి వెల్లడించారు. ఆ స్వామి వారే తనకు పునర్జన్మ కల్పించారని.. ఆయన ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈ నెల ఒకటో తేదీన గుండెపోటుకు గురైన తాను.. దాదాపు 30 గంటలు అపస్మారక స్దితిలో ఉన్నానని డాలర్ శేషాద్రి గుర్తు చేశారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

గత నలభై ఏళ్లుగా స్వామి వారి సేవలో ఉన్నానని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు తీవ్ర గుండెపోటుకు గురైన శేషాద్రికి అపోలోలో డాక్టర్లు చికిత్స అందించడంతో... పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. దీంతో తిరుపతిలో డాలర్ శేషాద్రికి పెద్ద జీయర్ స్వామి, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో రమణ పరామర్శించారు.
తిరుమలలో ప్రస్తుతం డాలర్ శేషాద్రి ఆఫీసర్ ఆన్ డ్యూటీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. 2006 నుంచి పొడగింపుపై ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2014లో ఆయన పదవిని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్దానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎమ్ జీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications