జర్నీలో పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. కఠిన శిక్ష పడుతుంది!
ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులను భారతీయ రైల్వే వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. రైల్వే వల్ల వివిధ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.రైలులో ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే మనం టికెట్ కొనుగోలు చేస్తాం. ప్రయాణికుల రైళ్లద్వారా రైల్వేకు ఆదాయం సమకూరుతోంది. అయితే సరకు రవాణాద్వారా అత్యధిక ఆదాయం వస్తోంది.
ప్రయాణికులు పలు సందర్భాల్లో టికెట్ లేకుండా రైల్వే సిబ్బందికి పట్టుబడుతుంటారు. ఈ పరిస్థితుల్లో జరిమానాతోపాటు శిక్ష కూడా పడుతుంది. టికెట్ లేకుండా ప్రయాణించడం కఠిన నేరం. రైల్వే చట్టం ప్రకారం టికెట్ కొనుగోలు చేయకపోతే సెక్షన్ 138 ప్రకారం జరిమానా విధిస్తారు. అతను ప్రయాణించిన దూరానికి లేదంటే రైలు బయలుదేరిన స్టేషన్ నుంచి ఎంత ఛార్జీ అవుతుందో అంత తీసుకోవడంతోపాటు అదనంగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ ధర, జరిమానా రుసుములో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని విధిస్తారు. టికెట్ లేని ప్రయాణికుడిని జైలులో పెట్టాలనే నిబంధన కూడా ఉంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వేలు ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందే భారత్ రైళ్లను తీసుకొస్తోంది. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా సిట్టింగ్ సదుపాయం, సెంట్రల్ ఏసీతో వీటిని రూపొందించారు. ప్రయాణికుల నుంచి రోజురోజుకు వీటికి ఆదరణ పెరుగుతుండటంతో చెన్నైలోని ఫ్యాక్టరీలో వీటి తయారీని ముమ్మరం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ లు కేటాయించారు. రానున్న రోజుల్లో మరొకటి కూడా కేటాయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది భువనేశ్వర్, విశాఖపట్నం మధ్య తిరుగుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications