పుష్కరాల్లో దొంగలు.. అలర్ట్ గా ఉండాలన్న చినరాజప్ప
విజయవాడ : పుణ్యం కోసం పుష్కర స్నానానికి వెళ్తే.. మధ్యలోనే నిలువునా దోచే దోపిడీ దొంగలు తయారయ్యారు. పుష్కరాల సందర్బంగా ఇప్పటిదాకా మొత్తం 96మంది దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. వీరంతా మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన దొంగలు కాగా.. ఇందులో 54మంది మహిళలు కూడా ఉండడం గమనార్హం.
పుష్కర స్నానం చేయాలనే ఆత్రుతలో ఉన్న భక్తులను అదును చూసి దోచుకోవడం ఈ దొంగల ముఠా పని. ఘాట్ల వద్ద కాచుకుని ఉండే ఈ దొంగలు సంధు దొరకగానే వస్తువులను కాజేసి అక్కడి నుంచి మాయం అవుతారు. కొంతమంది పురుషులు పూజారి అవతారాలు ఎత్తి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో బుధవారం నాడు మరో 11మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు, కొంత నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పుష్కరాలకు ఆభరణాలను ధరించకుండా రావాలి :
దొంగల బెడద నేపథ్యంలో.. పుష్కరాలకు వచ్చే భక్తులంతా నగలు ధరించకుండా రావాలని పిలుపునిచ్చారు హోంమంత్రి చినరాజప్ప. పుష్కర ఘాట్లలో స్నానాలు చేసేప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు.
గురువారం నాడు శ్రావణ పౌర్ణమి కావడంతో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఘాట్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశముందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. పుష్కరాలకు వచ్చి నీట మునిగిపోయి చనిపోయిన ఘటనలపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారాయనన.












Click it and Unblock the Notifications