సినిమా వాళ్లకు సీఎం జగన్ గుర్తున్నారా - కోట్లు సంపాదించి అక్కడే... : ఎమ్మెల్యే పసన్న కుమార్ ఫైర్..!!

ఏపీ ప్రభుత్వం వర్సస్ టాలీవుడ్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ ..ఇప్పుడు డైరెక్ట్ గా మారుతోంది. ఇప్పటి వరకు కొందరు టాలీవుడ్ నుంచి చేసిన వ్యాఖ్యలకు మంత్రులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఈ సమయంలో వైసీపీ సీనియర్ నేత.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

హీరోలకు సీఎం జగన్ గుర్తున్నారా

హీరోలకు సీఎం జగన్ గుర్తున్నారా

సినిమా హీరోలకు అసలు సీఎం జగన్ గుర్తు ఉన్నారా అని ప్రశ్నించారు. రెమ్యునరేషన్ పేరుతో కోట్లకు కోట్లు సంపాదించి హైదరాబాద్ లో కూర్చుంటున్నారని వ్యాఖ్యానించారు. విలాసవంతమైన జీవితం గుడుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సాధారణ ప్రేక్షకుడు రెండు గంటల వినోదం కోసం సినిమాకు వెళ్లాలంటే వందల రూపాయాలు ఖర్చు చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పెద్ద సినిమాల పేరుతో ఇష్టానుసారం టిక్కెట్ల రేట్లె పెంచితే చూస్తూ కూర్చోవాలా అంటూ ప్రశ్నించారు.

కోట్లు సంపాదించి అక్కడ విలాసవంతంగా

కోట్లు సంపాదించి అక్కడ విలాసవంతంగా

సీఎం జగన్ పేద ప్రజల కోసమే టిక్కెట్ల ధరలు తగ్గిస్తే అందులో తప్పేంటని నిలదీసారు. సినీ హీరోలు హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణలో సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో టిక్కెట్ల రేట్లు ఇష్టానుసారం పెంచుతుంటే ఏ సీఎం పట్టించుకోలేదన్నారు. తన వారు ఉండటంతోనే చంద్రబాబు వారి కోసం బాధ పడుతున్నారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. గతంలోనూ ప్రసన్న కుమార్ రెడ్డి సినీ హీరోల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వరదలు వచ్చి జనం బాధలు పడుతుంటే సినిమా హీరోలకు పట్టదా అంటూ నిలదీసారు.

Recommended Video

    #Krishnapatnam: Anandaiah కు Army Security | కిడ్నాప్ అవకుండా చూడండి - RGV || Oneindia Telugu
    చంద్రబాబు అందుకే మద్దతు

    చంద్రబాబు అందుకే మద్దతు

    హీరోలు తమ శక్తి మేర ఆదుకోవాలని డిమాండ్ చేసారు. అంతుకు ముందు జిల్లా అధికారుల పైన సన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఇక, ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లపైన ఆయన వేసి సెటైర్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయి. జగనన్న ఇళ్లల్లో శోభనానికి ఇబ్బందిగా ఉండే గదులను నిర్మించి ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పడు నేరుగా హీరోల సంపాదన.. వారికి ఏపీ సీఎం గుర్తు ఉన్నారా అంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పైన టాలీవడ్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+