గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో లేడీ టెక్కీ, కుమారుడు హత్య: భర్త అఫైర్‌ను వెల్లడించిన ఈమెయిల్స్

అమెరికాలో జరిగిన తల్లీకొడుకుల హత్యకు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. శశికళ కుటుంబ సభ్యులు ఈమెయిల్స్ బయటపెట్టి అల్లుడిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తన భార్యను, కుమారుడిని తాను హత్య చేయలేదని అమెరికాలోని ఎన్నారై టెక్కీ హనుమంతరావు చెప్పిన నేపథ్యంలో కొత్త కోణం వెలుగు చూసింది. అమెరికాలోని న్యూజెర్సీలో హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైన విషయం తెలిసిందే.

భార్య, కొడుకును నేను హత్య చేయలేదు, బాధలోనే ఆరోపణలు: హనుమంతరావు భార్య, కొడుకును నేను హత్య చేయలేదు, బాధలోనే ఆరోపణలు: హనుమంతరావు

మృతురాలు శశికళ తమకు పంపిన ఈమెయిల్స్‌ను ఆమె కుటుంబ సభ్యులు శనివారం బయటపెట్టారు. తన భర్త నర్రా హనుమంతరావుకు ఓ కేరళ మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ శశికళ తన సోదరుడు వేణుకు మెయిల్‌లో తెలిపింది. ఆమె ఈమెయిల్స్ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి.

అమెరికాలో తెలుగువారిపై మరో దారుణం: రక్తపు మడుగులో తల్లీ, కొడుకుఅమెరికాలో తెలుగువారిపై మరో దారుణం: రక్తపు మడుగులో తల్లీ, కొడుకు

ఈ మెయిల్స్‌ను వెల్లడించిన శశికళ కుటుంబ సభ్యులు హనుమంతరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కృష్ణ కుమారి తన అల్లుడు హనుమంతరావే తమ కూతురు శశికళను చంపాడని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు విడుదల చేసిన శశికళ ఈమెయిల్స్ హనుమంతరావుకు, మరో మహిళకు ఉన్న సంబంధాన్ని వెల్లడిస్తున్నాయి.

హనుమంతుకు పశ్చాత్తాపం లేదు....

హనుమంతుకు పశ్చాత్తాపం లేదు....

సిటిఎస్‌లో పనిచేసే దీపా అజిత్‌తో హన్మంతుకు సంబంధం ఉందని, రోజూ దీపాకు హన్మంత్ ఫోన్లు చేస్తున్నాడని, ఆమెతో చాట్ చేస్తున్నాడని శశికళ ఈమెయిల్స్‌లో తెలిపింది. తానేమీ తప్పు చేయలేదని బుకాయిస్తున్నాడని ఆరోపించింది. హన్మంతులో ఏ విధమైన పశ్చాత్తారం కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏమైనా చేసుకు పో అని బెదిరిస్తున్నాడని రాసింది.

కొడుకు ఉండి కూడా ఇలా....

కొడుకు ఉండి కూడా ఇలా....

ఐదేళ్ల కొడుకు ఉండి కూడా మరో మహిళతో సంబంధం ఘోరమని శశికళ వ్యాఖ్యానించింది. హన్మంతరావును తానేంతో నమ్మానని, ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు ఇలాంటి మోసం జరుగుతుందని అనుకోలేదని, వాళ్ల తల్లిదండ్రులూ, అక్కాబాబా అందరూ కుట్రదారులేనని ఆణె ఆరోపించింది. ఒక్క విషయం కూడా పంచుకోరని, పైగా ప్రమాదకారులని, ముఖ్యంగా తన అత్తయ్య చాలా చాలా ప్రమాదకారి అని, కొడుకును ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తి అని ఆమె వ్యాఖ్యానించింది.

అమ్మకు చెప్తే బాధపడుతుంది...

అమ్మకు చెప్తే బాధపడుతుంది...

ఈ విషయాలన్ని అమ్మకు చెప్తే బాధపడుతుందని శశికళ ఈమెయిల్‌లో అన్నది. ఇన్ని బాధలున్నా బతుకుతున్నాంటే కేవలం హనీష్ (కొడుకు) కోసమేనని ఆమె చెప్పింది. భార్యాభర్తల మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలతో పాటు భర్త వేధింపులకు సంబంధించి శశికళ సోదరుడికి పంపిన మెయిల్స్‌ను తల్లిదండ్రులు మీడియాకు చూపించారు.

సర్దుకుపోవాలనే చెబుతూ వచ్చాం....

సర్దుకుపోవాలనే చెబుతూ వచ్చాం....

పెళ్లి అయినప్పటి నుంచే భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటూ తమ కూతురు చాలా సార్లు చెప్పినా తామే సర్దుకుపోవాలని చెప్పామని, అయితే అల్లుడు ఇంత ఘాతుకానికి పాల్పడుతాడని తాము ఊహించలేదని శశికళ తల్లిదండ్రులు అన్నారు. కాగా, జంట హత్య కేసులో హనుమంతరావును అక్కడి పోలీసులు విచారణ జరిపారి. ప్రాథమిక విచారణ తర్వాత అతడ్ని విడుదల చేశారు.

 ఆ యువతితో హనుమంతు చాటింగ్

ఆ యువతితో హనుమంతు చాటింగ్

కేరళ యువతితో హనుమంతు చేసిన చాటింగ్‌ను కూడా శశికళ బంధువులు బయటపెట్టారు. "నా జీవితంతో ఆటలు ఆడుకుంటున్నావు. నువ్వొక అబద్ధాలకోరువు. నా భర్త ముందు నిలపబడి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలను. ఇదే విషయం నువ్వు నీ భార్య ముందు చెప్పగలవా.. నీ భార్యకు నువ్వు భయపడుతున్నావు. నాతో సంబంధంపై భయపడే వాడివైతే ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు. నీ దగ్గర నేనేం దాచలేదు" అని హనుమంతరావుకు కేరళ యువతి మెసేజ్ చేసింది.

English summary
A 40-year-old woman techie from Andhra Pradesh and her seven-year-old son living in New Jersey were murdered at home on Thursday. The deceased Sasikala Emails revealed the affair of NRI Techie Hanuanth Rao's affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X