రక్తపాతంతో ఉలిక్కిపడ్డ పల్నాడు.. వేటకొడవళ్లతో అన్నదమ్ములను కిరాతకంగా !!

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మరోసారి రక్తపాతంతో ఉలిక్కిపడింది. దుర్గి మండలం అడిగొప్పలలో అతి కిరాతకంగా ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకోగా.. మృతులు కొత్తా హనుమంతు, కొత్తా శ్రీరాంమూర్తిగా గుర్తించారు. దీంతో ఈ వ్యవహరం ఏపీ వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది.

వేర్వేరు ప్రాంతాల్లో దాడి.. పక్కా పథకంతోనే !!

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. హనుమంతును గ్రామం మధ్యలోని బొడ్రాయి సమీపంలో.. శ్రీరాంమూర్తిని నీలంపాటి అమ్మవారి గుడి వద్ద ఉన్న వాటర్ ప్లాంట్ సమీపంలో దుండగులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఒకే సమయంలో, వేర్వేరు ప్రాంతాల్లో దాడి జరగడంతో ఇది పక్కా ప్రణాళికతో చేసిన జంట హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కాగా జంట హత్యలతో ఒక్కసారిగా అడిగొప్పల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

double-murders-in-palnadu-district-create-huge-tensions-across-ap

ఈ క్రమంలోనే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ హత్యలకు కుటుంబ కలహాలు, వ్యక్తిగత విబేధాలు లేదా పాత శత్రుత్వాలే కారణమా? లేక రాజకీయ కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మృతులు, హత్య చేసిన వారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులుగా ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్యలకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మంత్రి గొట్టిపాటి స్పందన..

ఈ దారుణ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి.. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టవద్దని తెలిపారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలిని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+