లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే రైలు ప్రమాదానికి కారణం: డిఆర్‌ఎం, మృతుల వివరాలు
అనంతపురం: జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. లారీ బ్రేకులు ఫెయిలైనట్లు నిర్ధారణ అయ్యిందని.. అయినప్పటికీ డ్రైవర్ వేగంగా లారీని నడపడంతో అదుపు చేయలేకపోయాడని బెంగళూరు డిఆర్‌ఎం తెలిపారు.
లారీ రైల్వేగేటును వేగంగా ఢీకొని తర్వాత బోగీని ఢీకొన్నట్లు వెల్లడించారు. లారీని అదుపు చేయలేనంత వేగంగా నడపడమే ప్రమాదానికి కారణంగా ఆయన వెల్లడించారు.లారీని బోగీని వేగంగా ఢీకొనడంతో లారీలో ఉన్న గ్రానైట్ బండరాయి ఎగిరి బోగీలోకి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి బయటకు వచ్చింది.

దీంతో ఏసీ బోగీలోని కొందరు ప్రయాణీకులు బండరాయి తగిలి గాయపడ్డారు. కాగా, బండరాయి వేగంగా దూసుకురావడంతో ఎమ్మెల్యే తల తెగిపడినట్లు ప్రత్యక్ష్యసాక్షులు తెలిపారు.
AP: #Truck hits #Banglore-#Nanded #express, #six #dead http://t.co/WmQuWUw4dK #Video #Devdurg #MLA #VenkateshNaik pic.twitter.com/phB8oSDpzE
— Madhuri Rao (@thegirlfromIND) August 24, 2015 మృతుల వివరాలు:
కర్ణాటకలోని దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్, బెంగళూరులోని ఇండోసిల్ కంపెనీ మేనేజర్ బి.రాజు, సయ్యద్ అహ్మద్(రైల్వే ఉద్యోగి, ఏసీ మెకానిక్, గుంతకల్) పుల్లారావు (రాయచూర్), లారీ క్లీనర్ నాగరాజు (తాడిపత్రి). లారీ డ్రైవరు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతడ్ని పట్టుకుంటే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశముంది.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో బెంగళూరు- గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షోలాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను కల్లూరులో, ముంబయి- బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ను తాడిచెర్లలో, బీదర్-యశ్వంత్‌పూర్ రైలును గార్లదిన్నెలో, నిజాముద్దీన్- బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.












Click it and Unblock the Notifications