హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో 'డ్రగ్స్' రచ్చ-ఎమ్మెల్యే కుమారుడిపై ఆరోపణలు-డ్రగ్స్ టెస్టుకు టీడీపీ సవాల్-అలా తప్పించారంటూ...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో మరో 'డ్రగ్స్' వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు ప్రసాద్ డ్రగ్స్‌తో పట్టుబడ్డానే ప్రచారం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని స్వయంగా ఎమ్మెల్యే,ఆయన కుమారుడు వెల్లడించారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని... తమ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి దుష్ప్రచారాలకు తెరలేపారని స్పష్టం చేశారు. ఇప్పటికే గుజరాత్ డ్రగ్స్‌తో విజయవాడ లింకులపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ... తాజాగా ఎమ్మెల్యే కుమారుడి డ్రగ్స్ వ్యవహారంపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతనిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎమ్మెల్యే కుమారుడికి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సవాల్ విసిరారు.

నన్ను ఎదుర్కోలేకనే నా కొడుకుపై ఇలా :సామినేని ఉదయభాను

నన్ను ఎదుర్కోలేకనే నా కొడుకుపై ఇలా :సామినేని ఉదయభాను

'నిన్న సాయంత్రం 7గంటలకు ఒక వార్త చదివాను.ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్ 60కేజీల గంజాయి తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు పట్టుకున్నట్లు అందులో రాశారు.ఈ వార్త రాసినవారిని నేనొక్కటే అడగదలుచుకున్నా.గంజాయి వ్యాపారం దేనికి పనికిరాని సన్నాసులు చేస్తారు.. పనికిరాని ఎదవలు చేస్తారు... ఎమ్మెల్యేగా నేను ప్రజా సేవ చేస్తున్నా... నా గురించి,మా కుటుంబం గురించి మా నియోజకవర్గానికి,కృష్ణా జిల్లా ప్రజలకు బాగా తెలుసు.నా కుమారుడు యూకెలో కొంతకాలం ఐటీ జాబ్ చేశాడు.ప్రస్తుతం ప్లాస్టిక్,ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాడు.రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక... ఏదో రకంగా అవాస్తవాలు ప్రచారం చేయాలని చూస్తున్నారు. నన్ను ఏమీ అనలేక నా కుమారుడిపై నిరాధార వార్తలు పెట్టారు. ఆ ప్రచారం చేసినవారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తాను.నిజాలు నిగ్గు తేలుస్తాను.దేనికి వెనుకాడే పని లేదు. పైగా ఈ కేసు నుంచి నా కుమారుడిని తప్పించాలని కోరేందుకు నేను తాడేపల్లి కార్యాలయానికి వెళ్లినట్లు చెబుతున్నారు.ఇవాళంతా నేను మచిలీపట్నంలో ఉన్నాను.శాసనసభ్యులతో,స్థానిక నేతలతో కలిసి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక గురించి చర్చించాను.ఈ వార్తలు ప్రచారం చేసేవారికి సిగ్గుండాలి. ఏదైనా ఉంటే నన్ను ఎదుర్కోండి అంతేగానీ నా కుటుంబంపై,కుమారుడిపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు.' అని తెలిపారు.

ఎమ్మెల్యే కుమారుడి రియాక్షన్

ఎమ్మెల్యే కుమారుడి రియాక్షన్

'హైదరాబాద్‌లో ఒక రెండు వాహనాల్లో 60 కిలోల గంజాయి పట్టుబడితే... నన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.గంజాయితో నాకు,నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.కొంతమంది శత్రువులు సోషల్ మీడియాను వాడుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఏది పడితే అది రాస్తే చూస్తూ ఊరుకోము.దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తాం.ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో కుటుంబంతో గడుపుతున్నాను.అలాంటిది... నన్ను గంజాయి కేసులో పట్టుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో షాక్ తిన్నా.. బాధపడ్డాను.దయచేసి జగ్గయ్యపేట ప్రజలు ఈ అవాస్తవాలను నమ్మవద్దు.' అని ఎమ్మెల్యే కుమారుడు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే కుమారుడికి డ్రగ్ టెస్ట్ సవాల్ విసిరిన టీడీపీ..

ఎమ్మెల్యే కుమారుడికి డ్రగ్ టెస్ట్ సవాల్ విసిరిన టీడీపీ..

ఇదే అంశంపై తాజాగా టీడీపీ అధికార ప్రతనిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ... డ్రగ్స్ పుట్టలోంచి వైసీపీ విషసర్పాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కొడుకు ప్రసాద్ తెలంగాణ సరిహద్దులో 60 కిలోల గంజాయితో పట్టుబడ్డాడని ఆరోపించారు. అయితే తాడేపల్లి ప్యాలెస్,ప్రగతి భవన్ మధ్య మంతనాలతో ప్రసాద్‌ను ఈ కేసు నుంచి పక్కకు తప్పించారని ఆరోపించారు.

డ్రగ్స్ దందాపై ప్రశ్నిస్తున్న టీడీపీపై ఉదయభాను నోరుపారేసుకుంటున్నారని విమర్శించారు. ఒకవేళ ప్రసాద్‌కు డ్రగ్స్ లింకులు లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అతని శాంపిల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము ఎమ్మెల్యే ఉదయభానుకు ఉందా అని ప్రశ్నించారు.సోషల్ మీడియాలో 'who is drugs don in ap' అనే హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండదని... ఇది వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు.

ఆ ఇష్యూని వదలని టీడీపీ...

ఆ ఇష్యూని వదలని టీడీపీ...

ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం... అవి చేరాల్సిన కంపెనీ చిరునామా విజయవాడ పేరుపై ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు తేల్చడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే ఆ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడ పేరిట ఉందని... దాని కార్యకలాపాలన్నీ చెన్నై కేంద్రంగా సాగుతున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుకు ఏపీకి ఎలాంటి లింకులు లేవని తేల్చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టట్లేదు. ఏపీలో ఆ డ్రగ్స్ డాన్ ఎవరంటూ చర్చను లేవనెత్తారు. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ డ్ర‌గ్స్ వ్యవ‌హారంపై ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గుజ‌రాత్‌లో తీగ‌లాగితే ఏపీలో డొంక క‌దిలింది. రూ.72 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డ్రగ్స్ డాన్ ఎవరు. తాలిబన్ల డ్రగ్స్‌కి తాడేపల్లి ప్యాలెస్‌కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలుపెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్‌గా మార్చేశారు. దేశంలోని అత్యున్నత వ్యవస్థలన్నీ ఏపీ వైపు వేలు చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తుంటే డీజీపీ గారు మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారు. డ్రగ్స్ డాన్‌ని కాపాడేందుకు ప్రయత్నాలు ఆపి ఏపీ పరువు కాపాడేందుకు శ్రద్ధ చూపాలి.' అని లోకేష్ పేర్కొన్నారు.

ముంద్రా పోర్టులో డ్రగ్స్ కలకలం :

ముంద్రా పోర్టులో డ్రగ్స్ కలకలం :

ముంద్రా పోర్టుకు ఈ నెల 15న 2,988 కేజీల హెరాయిన్‌తో కూడిన రెండు కంటైనర్లు చేరుకున్నాయి.దీనిపై ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ ఇంటలిజెన్స్ టీమ్ ఆ పోర్టుకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. టాల్కం పౌడర్ పేరుతో ఉన్న గూడ్స్‌ను తెరిచి చూడగా... అందులో ఉన్నది హెరాయిన్‌గా తేలింది. విజయవాడకు చెందిన ఆషీ కంపెనీ పేరు మీద కంటైనర్లలో ఈ గూడ్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌లో ఉన్న హాసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ నుంచి ఈ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.ఆషీ కంపెనీని చెన్నైకి చెందిన ఓ జంట నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. కంపెనీ చిరునామా విజయవాడ పేరిట ఉండగా... దాని కార్యకలాపాలు మాత్రం చెన్నై నుంచే జరుగుతున్నాయి. అరెస్ట్ అనంతరం ఈ జంటను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 10 రోజుల కస్టడీకి అప్పగించింది. డీఆర్ఐ

English summary
Another 'drugs' issue has become a hot topic in Andhra Pradesh. There is a fake news circulating on social media that YSRCP MLA Samineni Udayabhanu's son Prasad has been caught with drugs. The MLA himself and his son revealed that the news came to their attention through social media. They made it clear that this was a completely false propaganda ... that they were exposed to such propaganda without being able to confront their family politically.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X