వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగురాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా .. ఇప్పుడు డ్రగ్స్ పెడలర్స్ అడ్డా ఏంటో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ రాకెట్స్ విచ్చలవిడిగా తమ దందా సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలుమార్లు డ్రగ్స్ మాఫియా ను పట్టుకున్నారు అధికారులు. గతంలో సినీ ఇండస్ట్రీలో విస్తరించిన డ్రగ్స్ మాఫియాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరిగింది. సినీ ప్రముఖులు ఎందరో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్నారు.

 రకరకాల మార్గాలతో రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

రకరకాల మార్గాలతో రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

గతంలో సినీ ప్రముఖులకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నాయన్న కారణంగా డ్రగ్స్ మాఫియా ఏం చేస్తుందో వెలుగులోకి వచ్చింది.అప్పటి నుండి ఇప్పటివరకూ పలు సందర్భాల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఈ ముఠాల ఆగడాలకు చెక్ పెట్టలేక పోయారు ఎక్సైజ్, పోలీస్ మరియు నార్కోటిక్స్ అధికారులు.ఇటీవల స్కూళ్ళు, కాలేజీలు టార్గెట్ చేస్తూ డ్రగ్స్ మాఫియా యువతను పెడదారి పట్టి స్తోందని, డ్రగ్స్ కు యువతను బానిసలుగా చేస్తుందని పలు సంఘటనల ద్వారా తేటతెల్లమైంది.రకరకాల మార్గాలతో రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకుంది.

కాఫీషాపులను అడ్డాలుగా మార్చుకున్న డ్రగ్స్ పెడలర్స్

కాఫీషాపులను అడ్డాలుగా మార్చుకున్న డ్రగ్స్ పెడలర్స్

స్కూళ్ళు, కళాశాలలలో డ్రగ్స్ రవాణాపై పోలీసులు దృష్టి సారించిన నేపద్యంలో ఇప్పుడు డ్రగ్ పెడలర్స్ దృష్టి చిన్న చిన్న కాఫీ షాపుల మీద పడింది.కాఫీ షాప్ ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఎక్కువగా యువత వచ్చే కాఫీ షాప్ లను టార్గెట్ చేసుకున్న పెడలర్స్ కాఫీ షాప్ ల ద్వారా అమ్మకాలు సాగిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే కాఫీ షాపుల కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది.

డ్రగ్స్ సరఫరా అరికట్టేందుకు అధికారుల నిఘా అవసరం

డ్రగ్స్ సరఫరా అరికట్టేందుకు అధికారుల నిఘా అవసరం

మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న మాదకద్రవ్యాల వినియోగం పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు డ్రగ్స్ సరఫరాపై ఎప్పటికీ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూ చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టాల్సిన అవసరముంది.

విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్ .. బీ అలెర్ట్

విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్ .. బీ అలెర్ట్

ఒకప్పుడు హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అయిన ఈ డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు వైజాగ్ , విజయవాడ వంటి నగరాల్లోనూ విస్తరించింది. రేవ్ పార్టీల పేరుతో కూడా డ్రగ్స్ దందా సాగుతుంది. స్కూళ్ళు, కళాశాలలు, యూనివర్సిటీలు , పబ్బులు మాత్రమే కాదు కాఫీ షాపులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. లేకుంటే తెలుగు రాష్ట్రాల యువత భవిత ప్రమాదంలో పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

English summary
Drug peddlers have now turned their attention to small coffee shops in a backdrop of police's focus on drug trafficking in schools and colleges. Drugs are reported to be supplied through coffee shops. Peddlers targeted Coffee Shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X