మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన ఏఆర్ కానిస్టేబుల్: టెక్కీ తేజస్విని బ్రెయిన్ డెడ్

విజయవాడ: మద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా మోటార్‌ బైక్ నడిపి మరో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యారు.

చెన్నైలో తేజస్విని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తన స్వగ్రామమైన విజయవాడకు వచ్చింది. సోదరుడితో కలిసి బుధవారం నాడు ఆమె బైక్‌పై వెళ్తోంది. అయితే అదే సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపి ఢీకొట్టాడు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

Drunk constable’s road rage puts a techie in brain dead condition

తేజస్విని బ్రెయిన్‌ డెడ్‌కు గురైందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యాడు. ఏఆర్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్‌ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొన్నారు.

గతంలో కూడ ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు గురయ్యారని స్థానికులు చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+