AP DSC: నిరుద్యోగులకు ఏపీ సర్కారు గుడ్‌న్యూస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులన్నది త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. పండగ తర్వాత మెగా డీఎస్సీ ఉంటుందన్నారు.

ఎన్ని ఉద్యోగాల భర్తీ, విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామన్నారు. సంక్రాంతి కానుకగా ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. మరోవైపు, శనివారం 4వ లిస్టు విడుదల ప్రచారాలను మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేదని.. ఏదైనా ఉంటే చెబుతామన్నారు మంత్రి బొత్స.
ఏపీ గ్రూప్-2 దరఖాస్తుకు దగ్గరపడుతున్న గడువు
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 దరఖాస్తులకు చివరి తేదీని పొడిగించిన విషయం తెలిసిందే. జనవరి 17 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. గ్రూప్-2 దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అభ్యర్థులు వాపోవడంతో జనవరి 17 వరకు గడువు తేదీని పెంచారు.
గత డిసెంబర్ నెలలో రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications