Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
కలుయుగవైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటలు పడుతుండగా.. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు.
మంగళవారం స్వామివారిని 70,496 మంది భక్తులు దర్శించుకోగా 25 వేల మంది తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. హుండీ కానుకల ద్వారా టీటీడీ 5.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా ప్రకటించారు. కాగా దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి శ్రీవారి దేవస్థానం రెండో స్థానంలో నిలిచింది.

పర్యాటకుల గదుల బుకింగ్ తిరుపతి నగరంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 233 శాతం పెరిగినట్లు సర్వే లేలింది. వారణాసి, షిర్డీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా.. తిరుమలలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగనుంది.












Click it and Unblock the Notifications