లింగ మార్పిడి చేసి వదిలేశాడు :పాత స్నేహితుడిపై ఫిర్యాదు
విజయవాడ: లింగ మార్పిడి చేసి వదిలేసిన స్నేహితుడిపై ఫిర్యాదు చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకొంది.ఈ ఘటన విజయవాడ సమీపంలోని పెనమలూరులో కలకం రేపింది.
ఇద్దరూ కలిసి చదువుకొన్నారు.సన్నిహితంగా ఉండేవారు. ఎప్పటికీ కలిసి ుండాలన్న కోరిక వారిలో కలిగింది.దీంతో ఇద్దరూ స్నేహితుల్లో ఒకరు లింగ మార్పిడి చేసుకొని స్త్రీ మారిపోయారు.కొంతకాలంపాటు కలిసే ఉన్నారు.కాని, ప్రస్తుతం విడిపోయారు. దీంతో లింగ మార్పిడి చేసుకొని స్త్రీ మారిన వ్యక్తి స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కానూరు చెందిన రాకేష్ రెడ్డి, దుర్గారావులు కొంతకకాలంపాటు ఒంగోలులో కలిసి చదువుకొన్నారు. ఒకే హాస్టల్ లో ఉండేవారు. చదువు ముగిశాక దుర్గారావు ముంబై వెళ్ళి లింగమార్పిడి చేసుకొన్నాడు. దుర్గారావు దుర్గ గా మారాడు.దీంతో కొంతకాలంపాటు దుర్గ, రాకేష్ రెడ్డిలు కలిసి జీవించారు.
కొంత కాలంపాటు కలిసి ఉన్నవారు. రాకేష్ వివాహాం కూడ చేసుకొన్నాడని దుర్గ చెబుతోంది.ప్రస్తుతం వేరోకరిని వివాహాం చేసుకొనేందుకు రాకేష్ ప్రయత్నిస్తున్నాడని దుర్గ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలను రాకేష్ కుటుంబసభ్యులు ఖండిస్తున్నారు.రాకేష్ రెడ్డిపై దుర్గ పిర్యాదు చేసింది. రాకేష్ రెడ్డి కుటుంసభ్యులు కూడ దుర్గపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications