ఇంద్రకీలాద్రికి సరికొత్త రోడ్డు.. దేవీ నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ రిలీజ్..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు 2 వరకు నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. కనకదుర్గా అమ్మవారు 11 రోజులు పాటు 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం ఆలయం ముందు భారీ రోడ్డును నిర్మించింది. ఇదివరకు మాదిరిగా కాకుండా రోడ్డును నలువైపులా పూర్తిగా విస్తరించారు.
దీంతో దర్శనానికి వెళ్లే భక్తులను దర్శన సమయం తగ్గనుంది. అతి త్వరగానే భక్తులకు దుర్గమ్మ దర్శనభాగ్యం కలుగనుంది. ఇదివరకు దర్శనానికి వెళ్లే రోడ్డులో దుకాణాలు, ఇతర షెడ్ల కారణంగా కాస్త ఇరుకుగా ఉండేది. అయితే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టింది. రోడ్డు విస్తరణ తర్వాత ఎలాంటి తొక్కిసలాట, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు సాఫీగా వెళ్లి దర్శనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు.
ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. త్రిమాత స్వరూపమైన దుర్గాదేవి.. మహాశక్తి స్వరూపిణి ఈ తెలుగు నేలపై ఉంది. తెలుగు భక్తుల వైభవానికి ప్రతీకగా తెలుగు ఇంటి పడచుగా పూజలు అందుకుంటోంది.
అమ్మవారి అలంకారాలు
సెప్టెంబర్ 22 - శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ) 1
సెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రీ దేవి ) 2
సెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి ) 3
సెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయని దేవి ) 4
సెప్టెంబర్ 26 - శ్రీ మహాలక్ష్మీ దేవి ) 5
సెప్టెంబర్ 27 - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ) 6
సెప్టెంబర్ 28 - శ్రీ మహాచండీ దేవి ) 7
సెప్టెంబర్ 29 - శ్రీ సరస్వతీ దేవి ) 8
సెప్టెంబర్ 30 - శ్రీ దుర్గాదేవి ) 9
అక్టోబర్ 01 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి ) 10
అక్టోబర్ 02 - శ్రీ రాజరాజేశ్వరి దేవి ) 11
అమ్మవారి నైవేద్యం
సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం. ఉదయం 9.గం.ల నుంచి రాత్రి 11.గం. ల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉదయం 4.గం.ల నుంచి రాత్రి 11.గం.ల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. మహా మండపంలో 6వ అంతస్తులో కుంకుమార్చన లు, దేవి ఖడ్గమాలార్చనలు, శ్రీ చక్ర నవార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. యాగ శాలలో చండీ హోమం ప్రతిరోజూ జరుగుతుంది.

(సెప్టెంబర్ 29 మూల నక్షత్రం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 2 గం.ల నుండి రాత్రి 11.గం.ల దాక అమ్మవారి దర్శనాలు ఉంటాయి. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కనుక, ఇదే రోజున మధ్యాహ్నం సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు)
దసరా మహోత్సవాలలో ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో ఆది దంపతుల నగరోత్సవం నిర్వహించబడును. సనాతన ధర్మ ప్రచార నిమిత్తం ఆధ్యాత్మిక , సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దసరా ఉత్సవాలలో దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌకర్యర్ధం క్యూ లైన్ లలో త్రాగునీరు, వివిధ ప్రదేశములలో ఉచిత వైద్య, సదుపాయాలు, అమ్మవారి అన్నప్రసాదం ఏర్పాట్లు, భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాలలు, మొదలగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.. అని దేవస్థానం బోర్డు తెలిపింది.
దేవి శరన్నవరాత్రులలో అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యములు, అమ్మవారి అలంకారములు 11 రోజులు... అమ్మవారి 11 అలంకారాలు...
1. మొదటిరోజు బాలా త్రిపుర సుందరీ దేవి (తీపిబూంది, శెనగలు లేదా పెసరపప్పు పాయసం ) ఆరెంజ్ కలర్ శారీ
2. రెండోవరోజు గాయత్రీ దేవి (రవ్వకేసరి, పులిహోర) బ్లూ కలర్ శారీ
3. మూడోవ రోజుఅన్నపూర్ణ దేవి( దద్ధోజనం లేదా కట్టెపొంగలి ) పసుపు కలర్ శారీ
4. నాల్గోవ రోజు కాత్యాయని దేవి ( బెల్లం అన్నం, అన్నం ముద్దపప్పు )ఫుల్ రెడ్ కలర్ శారీ
5. ఐదోవ రోజు మహాలక్ష్మీ దేవి(పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది ) పింక్ కలర్ శారీ
6. ఆరోవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి ( పులిహోర, పెసర బూరెలు ) గ్రీన్ కలర్ శారీ
7.ఏడోవ రోజు మహాచండీ దేవి( లడ్డు ప్రసాదం ) రెడ్ కలర్ శారీ
8. ఎనిమిదో రోజు సరస్వతి దేవి( పరవణ్ణం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి )వైట్ కలర్ శారీ
9. తొమ్మిదో రోజుదుర్గాదేవి ( గారెలు, నిమ్మరసం కలిపిన అల్లంముక్కలు )రెడ్ కలర్ శారీ
10. పదోవరోజుమహిషాసురమర్ధిని దేవి( చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం) రెడ్ కలర్ శారీ
11. పదకొండవ రోజురాజరాజేశ్వరి దేవి( పులిహోర, గారెలు ) గ్రీన్ కలర్ శారీ
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications