బిర్యాని ప్రియుల‌కు ద‌స‌రా కానుక‌... 3రూపాయ‌లకే బిర్యాని...

రెండు తెలుగు రాష్ట్రాల్లో ద‌స‌రా సంబురాలు అంబ‌రాన్నంటాయి. పండ‌గ‌వేళ చాలా మార్కెట్ల‌లో ఆఫ‌ర్లు న‌డుస్తున్నాయి. చాలా చోట్ల కొత్త రెస్టారెంట్లు, కొత్త దుకాణాలు కూడా ప్రారంభ‌మ‌వుతాయి. కొన్ని రెస్టారెంట్ల‌లో ఫుడ్ ఆఫ‌ర్లు కూడా ఉంటాయి. బిర్యాని ప్రియుల‌కు ఓ రెస్టారెంట్ ద‌స‌రా కానుక ఇచ్చింది. కేవ‌లం 3 రూపాయ‌ల‌కే బిర్యాని ఆఫ‌ర్ ప్ర‌క‌టించేసింది. ఈ బంఫ‌ర్ ఆఫ‌ర్ ఎక్క‌డో తెలుసుకుందాం ప‌దండి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరులో ఒక రెస్టారెంట్ బిర్యానిప్రియులకు నోరూరించే ఆఫర్ ప్రకటించింది. ఆశ్వారావుపేట రోడ్డులో శనివారం ఇటీవ‌లే ఓ రెస్టారెంట్ ప్రారంభ‌మ‌య్యింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా చికెన్ బిర్యానీ కేవలం 3రూపాయలకే అందిస్తామంటూ ఆ రెస్టారెంట్ బిర్యాని ల‌వ‌ర్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది. దీంతో బిర్యానీ కోసం జనాలు రెస్టారెంట్ వద్ద బారులు తీరారు. ఇక‌, చికెన్ బిర్యానిని ఓ ప‌ట్టుప‌ట్టేసారు.

Dussehra gift for biryani lovers Biryani for 3 rupees

మూడు గంట‌లు మాత్ర‌మే..

జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఇటీవ‌లే ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహ‌కులు భోజ‌న ప్రియుల కోసం అన్‌ లిమిటెడ్ ఆఫర్ పెట్టారు. 3 రూపాయ‌ల‌కే చికెన్ బిర్యాని అని ప్ర‌క‌టించారు. అన్ లిమిటెడ్ బిర్యానీ అంటూ ప్రచారం జోరందుకుంది. రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మూడు రోజుల ముందు నుంచే ఈ బిర్యానీ ఆఫర్ గురించి తీవ్ర ప్ర‌చారం జ‌రిగింది. నిన్న రెస్టారెంట్ ప్రారంభ‌మ‌య్యింది.

అయితే ఈ అన్‌లిమిటెడ్ బిర్యానీ ఆఫర్‌ కేవలం మూడు గంటలు మాత్రమే నిర్వ‌హించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఈ ఆఫ‌ర్ అనే షరతు కూడా పెట్టారు. బిర్యానీ అంటే చాలామందికి నోరూరుతుంది. ఇక‌, అంత త‌క్కువ ధ‌ర‌కే బిర్యానీ దొరుకుతుంద‌టే ఎవ‌రీకి మాత్రం ఆశ ఉండ‌దు చెప్పండి. రెస్టారెంట్ ముందు భారీ సంఖ్యలో భోజన ప్రియులు ఎగబడి వ‌చ్చారు. దీంతో నిర్వాహకులకు వారిని ఎలా ఆపాలో అర్థం కాలేదు. దాంతో భారీ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. వారికోసం సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు.

5 వేల మంది..

రూ.3 చికెన్ బిర్యానీని సుమారు నాలుగు వేల నుండి 5 వేల మంది వినియోగించుకున్నట్లు రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. అయితే, మూడుగంట‌ల ఆఫ‌ర్‌కు ఇంతలా రెస్పాన్స్ వస్తుందని ఎవ్వ‌రూ ఊహించలేదని అన్నారు. వీటితోపాటు రెస్టారెంట్‌ ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఇతర ఐటమ్స్ పై కూడా అన్ లిమిటెడ్ ఆఫర్లు ప్రకటించినట్లు స‌మాచారం.. రూ .290కే ఒక వ్యక్తికి తిన్నంత బిర్యానీ, రూ.380 కి ఒక వ్యక్తి నాలుగు రకాల స్టార్టర్లతో పాటు ఏవైనా ఎంతైనా తినే ఆఫర్‌ను అందించారు. 580 రూపాల‌యల‌కి ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్‌లోని మెనూలో ఉన్న 30 రకాల ఐటమ్స్ తినొచ్చు. ఇలా అనేక అన్ లిమిటెడ్ ఆఫర్లను కూడా రెస్టారెంట్ నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+