దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరు: దివ్వల మాధురి రిజిస్ట్రేషన్ చెల్లదన్న వాణి!
దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఇంకా కొనసాగుతుంది. రోజుకో మలుపు తీసుకుంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు ఇకపై నా ఇల్లు అంటూ సంచలన ప్రకటన చేసింది దివ్వల మాదిరి. దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కూడా చూపించింది.
దువ్వాడ వాణి వర్సెస్ దివ్వల మాధురి.. మళ్ళీ పోరు
అంతే కాదు తాను తన ఇంట్లోకి వెళ్లి ఉంటానని తనకు ఎటువంటి హాని జరిగినా దువ్వాడ వాణిదే బాధ్యత అని స్పష్టం చేసిన దివ్యల మాధురి ఎట్టకేలకు దువ్వాడ ఇంట్లో అడుగుపెట్టింది. ఇక దీంతో దువ్వాడ వాణి మళ్లీ రచ్చ మొదలుపెట్టింది. గత నెల రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మకాం వేసి తనని ఇంట్లోకి రానివ్వాలని పోరాటం చేస్తున్నదువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఈ ఘటనతో షాకయ్యారు.

దువ్వాడ ఇంట్లో మాధురి.. మండిపడిన దువ్వాడ వాణి
దివ్వల మాధురికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని తన కూతుర్ల పేరుతో రాయమని, ఆ ఇంట్లోనే ఉంటామని మొండిపట్టు పట్టిన దువ్వాడ వాణి తాజాగా దివ్వెల మాధురి ఇకపై దువ్వాడ ఇల్లు తన ఇల్లు అని చెప్పడంతో నిప్పులు చెరుగుతున్నారు.
ఆ ఇంట్లో మాధురి ఉండటంపై దువ్వాడ వాణి ఆగ్రహం
ఇంట్లోకి వెళ్లేందుకు తమకు అనుమతి లేదు కానీ మాధురిని ఎలా అనుమతి ఇస్తారని వాణి పోలీసులను ప్రశ్నిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురి తో వివాహేతర సంబంధం పెట్టుకొని తమ ఆస్తిని తమకు కాకుండా చేసిందని ఆమె ఆరోపించారు. ఆమె చరిత్ర అంతా ఇలాంటిదే అని అసహనం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు తమకు కోర్టు అనుమతి ఇచ్చిందని వాణి గుర్తు చేశారు.
లైవ్ లో కాల్ చేసి శ్రీనివాస్ తోనూ చెప్పించిన దివ్వల మాధురి
ఆ ఇంటి పైన ప్రస్తుతం కేసు ఉందని, ఎట్టి పరిస్థితులలోనూ దువ్వాడ శ్రీనివాస్ చేసిన రిజిస్ట్రేషన్ చెల్లబోదని, తాను ఆ ఇంటి కోసం ఎక్కడి వరకైనా వెళ్తానని ఆమె తేల్చి చెప్పారు.ఇక దివ్వల మాధురి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ తనకు రెండు కోట్లు ఇవ్వాలని తనకు ఇవ్వాల్సిన డబ్బుల కింద రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు. ఇక శ్రీనివాస్ కు లైవ్ లో కాల్ చేసి ఆయన నోటి ద్వారా కూడా మీడియాకు ఈ విషయాన్ని చెప్పించారు.
రిజిస్ట్రేషన్ చెల్లదన్న వాణి న్యాయ పోరాటం
దువ్వాడ స్వార్జితంగా సంపాదించిన ఆస్తిని, తనకు ఇవ్వాల్సిన అప్పు క్రింద తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, ఇప్పుడు ఆ ఇంటి పైన తనకే పూర్తి హక్కులు ఉన్నాయని దివ్వల మాధురి తేల్చి చెబుతున్నారు.అయితే ఆమె రిజిస్ట్రేషన్ చెల్లదని ఎంతవరకైనా న్యాయపోరాటం చేస్తామని దువ్వాడ సతీమణి వాణి తెగేసి చెబుతున్నారు. మరి వీరిద్దరి మధ్య ఇంటి కోసం జరుగుతున్న పోరాటం ముందు ముందు ఏ రూపం తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications