పవన్ కళ్యాణ్ పై దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు..! రీల్స్ కేసు వెనుక..?

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ దువ్వా శ్రీనివాస్ ను వివాదాలు చుట్టుముట్టాయి. ఇదే క్రమంలో తన ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన ఆయన.. అక్కడ ఆమెతో కలిసి పలు ఫొటోలు, వీడియోల్లో కనిపించారు. అయితే వీరిద్దరూ కలిసి అక్కడ రీల్స్ చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలు కూడా తెరపైకి వచ్చాయి.

ఓ యూట్యూబ్ ఇంటర్వూలో మాట్లాడుతూ ఎవరు తప్పు చేయడం లేదంటూ పవన్ కళ్యాణ్ ను లాగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు కాలేదా అంటూ మాధురి చేసిన వ్యాఖ్యలు ఆయన ఫ్యాన్స్ కు మంటపుట్టించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా మాధురితో పాటు దువ్వాడను టార్గెట్ చేస్తూ జనసైనికులు ఇప్పటికే రెచ్చిపోతున్నారు. అదే సమయంలో రీల్స్ కేసు కూడా నమోదు కావడంతో ఇదంతా కక్షసాధింపులో భాగమేనంటూ దివ్వెల మాధురి స్పందించారు.

duvvada Srinivas s lover divvela Madhuri says case for pawan kalyan remarks not for reels

తిరుమల కొండపై తాను అసలు రీల్సే చేయలేదని, అందరిలాగే తాను, దువ్వాడ శ్రీను తిరుపతి వెళ్లినట్లు దివ్వెల మాధురి వెల్లడించారు. కొంతమంది మీడియా వాళ్లు తమ ఫోటోలు తీశారని తెలిపారు. అంతే కానీ తిరుమాడ వీధుల్లో రీల్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేశాననే కక్షతో తనపై కేసు పెట్టారని మాధురి తెలిపారు. ఇది తప్పుడు కేసన్నారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+