మహిళలు బాగా సంపాదించి స్థిరపడేలా మరో సువర్ణావకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా స్వయం సహాయక బృందాల మహిళలకు చాయ్, కాఫీ సెంటర్ల ద్వారా స్థిరమైన ఆదాయం అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేటివ్‌ అరకు కాఫీ, గాటోస్‌ కేఫ్, చాయ్‌ రాస్తా వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

ప్రతి జిల్లాలో ఐదు చొప్పున మొత్తం 140 కేఫ్ సెంటర్లు

ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఐదు చొప్పున మొత్తం 140 సెంటర్లు ఏర్పాటు చేసే లక్ష్యంతో సెర్ప్‌ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే నేటివ్‌ అరకు కాఫీ సెంటర్లు 37 ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో గాటోస్‌ కేఫ్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. శ్రీకాకుళం, తిరుపతి వంటి ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

DWCRA women self employment In ap DWCRA women with self-employment through tea and coffee centres

డ్వాక్రా మహిళలకు సువర్ణావకాశం

పట్టణ ప్రాంతాల్లో చాయ్‌ రాస్తా సెంటర్లు ఇప్పటికే నడుస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆసక్తి ఉన్న డ్వాక్రా మహిళలు తమ జిల్లా వెలుగు కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. ప్రతి యూనిట్‌ ఏర్పాటు వ్యయం రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉంటుంది. నేటివ్‌ అరకు కాఫీ సంస్థ కంటెయినర్‌, వర్కింగ్‌, కరెంట్‌ మోడళ్లను అందిస్తోంది.వీటి ఖర్చు రూ.3.9 లక్షల నుంచి రూ.5.9 లక్షలు.

నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం

గాటోస్‌ కేఫ్‌ రూ.5 లక్షల మోడల్‌ను ప్రతిపాదించగా, చాయ్‌ రాస్తా రూ.3.9 లక్షల నుంచి రూ.6.7 లక్షల వరకు నాలుగు రకాల కేంద్రాలను రూపొందించింది. మహిళలు తమ అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. కొత్తగా ప్రారంభించేవారికి, ఇప్పటికే వ్యాపారం నడుపుతున్నవారికి ఈ అవకాశం వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ సెంటర్లు నడుపుతున్న మహిళలు నెలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!
సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!

ప్రాసెసింగ్‌ పరికరాలపై 35 శాతం రాయితీ

సగటున ఐదు నెలల్లోనే పెట్టుబడిని తిరిగి పొంది లాభాలు సంపాదించారు. ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయడంతో పాటు పీఎంఈజీపీ పథకం ద్వారా ప్రాసెసింగ్‌ పరికరాలపై 35 శాతం రాయితీ అందిస్తోంది. సంస్థలు రాయల్టీని కూడా మినహాయించాయి. దీనివల్ల మహిళలపై ఆర్థిక భారం తగ్గి, స్వయం ఉపాధి మరింత సులభమవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళా సాధికారత కోసం తీసుకున్న ఈ నిర్ణయం మహిళల జీవితాల్లో మార్పు తెస్తుందని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+