గ్రౌండ్ రిపోర్ట్స్ తో పవన్ అలర్ట్, కీలక నిర్ణయం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతోంది. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో లెక్కలు మారుతున్నాయి. ప్రభుత్వం.. పార్టీ పరిస్థితి పైన డిప్యూటీ సీఎం పవన్ పూర్తి సమాచారం సేకరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 30న విశాఖ సభ వేదికగా పవన్ ప్రకటించే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన పైన డిప్యూటీ సీఎం పవన్ క్షేత్ర స్థాయిలో పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ ప్లీనరీ మినహా పార్టీకి సంబంధించి పవన్ సమావేశాలు పెద్దగా నిర్వహించ లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తిరిగి పార్టీ బలోపేతం పైన పవన్ ఫోకస్ చేసారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని పవన్ పదే పదే చెబుతున్నారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు.. తాము ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇంఛార్జ్ ల మాటే చెల్లుబాటు అవుతూందని జనసేన నేతలు అంతర్గత సమావేశాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. పవన్ మాత్రం సమస్యలను పరిష్కరించుకొని కలిసి కట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు.
ఇక, ఏపీతో పాటుగా తెలంగాణలోనూ పార్టీ పైన పవన్ కొత్తగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. దీంతో.. ఏపీ, తెలంగాణలో పార్టీ భవిష్యత్ పైన దిశా నిర్దేశం చేసేందుకు సిద్దమయ్యారు. ఇందు కోసం విశాఖపట్నంలో ఈనెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్ల కోసం విశాఖ జిల్లా ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొనేలా విస్తృత ప్రచారం చేస్తున్నారు. విశాఖ వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 30వ తేదీ మధ్యాహ్నం బహిరంగ సభ జరనుంది. రెండు రాష్ట్రాలకు చెందిన జనసేన నేతలను ఆహ్వానిస్తుండటంతో.. పవన్ తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications