పవన్ తాజా నిర్ణయం వెనుక..ఇక డిసైడ్ అయిపోయారా..!?
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటి వరకు వేచి చూసే ధోరణితో కనిపించిన పవన్.. ఒక్క సారిగా రూటు మార్చారు. మారుతున్న సమీకరణాలు.. క్షేత్ర స్థాయి పరిస్థితులతో పవన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.
డిప్యూటీ సీఎం పవన్ గేరు మార్చారు. రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రం లో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని పవన్ పదే పదే చెప్పుకొచ్చారు. కూటమి బలం పెంచుకునేలా వ్యవహరిస్తూ.. పార్టీని బలోపేతం చేసుకోవాలని తాజాగా జనసేన ఎమ్మెల్యేలకు పవన్ నిర్దేశించారు. అదే విధంగా ఎక్కువగా ప్రజల్లో ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని... పొత్తులో భాగంగా సీట్లు తగ్గించుకున్నామని.. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా పార్టీ కేడర్ ను బలోపేతం చేస్తూ.. ఎన్నికలకు సమాయత్తం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం వరుస జిల్లా పర్యటనలకు పవన్ డిసైడ్ అయ్యారు.

2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత పవన్ పార్టీ పైన పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ఎమ్మెల్యేలతో ఒకటి రెండు సార్లు సమావేశం నిర్వహించారు. అయితే, ఇప్పుడు మాత్రం ఇక పార్టీ బలోపేతం కోసం సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వం - పార్టీని పవన్ సమన్వయం చేసుకుంటూ జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. ముందుగా పార్వతీపురం లో పర్యటన చేయనున్న పవన్.. తర్వాత ప్రకాశం.
నెల్లూరు జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. జన సైనికుల తో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. ఇక నుంచి ఎక్కువగా జనం లో ఉండాలని పవన్ నిర్ణయించారు. స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేస్తూ.. ఆ ఎన్నికల ద్వారా క్షేత్ర స్థాయిలో మరింత బలం పెరిగేలా పవన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ తాజా నిర్ణయం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications