రూటు మార్చిన పవన్, ఢిల్లీ అలర్ట్ - కీలక మలుపు..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసు కుంటోంది. అటు వైసీపీ ఇప్పటికే ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మూడ్ తెలుసుకొనేందుకు రాబిన్ శర్మ టీం ను మరోసారి రంగంలోకి దిం చారు. జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఏపీలో పరిణామాల ను ఢిల్లీ నాయకత్వం గమనిస్తోంది. ఇదే సమయంలో పవన్ కు క్షేత్ర స్థాయి పరిస్థితుల పై తాజా అలర్ట్స్ అందాయి. దీంతో, కీలక నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కొత్త పాత్ర
డిప్యూటీ సీఎం పవన్ అటు ప్రభుత్వం.. ఇటు పార్టీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఎన్నికల ప్రచారం లో పవన్ అనేక హామీలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ ఎలా స్పందిస్తున్నారనేది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో చెప్పిన విధంగా పవన్ స్పందన లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే విధంగా గత ఎన్నికల్లో బలం లేదనే కారణం తో జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లకే పరిమితం అయింది.

జిల్లాల పర్యటనలు
ఇక, ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తోంది. అటు జగన్ జనవరి నుంచి జిల్లా పర్యటనలకు సిద్దమయ్యారు. ఇటు ఢిల్లీ నేతలతోనూ పవన్ సన్నిహితంగా కొనసాగుతున్నారు. ఈ సమయంలో కూటమిలో ఉంటూనే పార్టీ బలోపేతం కోసం పవన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి చివరి వారం నుంచి ప్రతీ జిల్లాలోనూ వరుసగా పర్యటనలు చేసేలా పవన్ తాజా నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ ప్రభుత్వ పాలన .. ప్రజాభిప్రాయం.. లోటు పాట్లు దిద్దుబాటు దిశగా ఈ పర్యటనలు ఉండనున్నాయి. ప్రజలతో మమేకం అయ్యేలా పవన్ తన జిల్లా పర్యటనల పైన కసరత్తు చేస్తున్నారు.
పవన్ నిర్ణయం తో
ఇక, పార్టీ బలోపేతానికి అధికారంలో ఉన్న సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఇందు కోసం ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీ బలం పెరిగేలా తన జిల్లాల పర్యటన వేళ వరుస సమావేశాలకు సిద్దం అవుతున్నారు. పర్యటనల సమయంలో జిల్లాల్లో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు. పర్యటనలో రోజంతా ప్రజలతో మమేకం కానున్నారు. అదే విధంగా పార్టీ శ్రేణులకు సమయం ఇవ్వనున్నారు. దీంతో, పవన్ తాజా నిర్ణయంతో ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications