సీజ్ ది షిప్, పవన్ పట్టు- చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా పైన పవన్ సీరియస్ అయ్యారు. సీజ్ ది షిప్ అంటూ హుకుం జారీ చేసారు. రాష్ట్రంలో బియ్యం మాఫియా పైన చర్యలకు పవన్ డిమాండ్ చేస్తున్నారు. అటు ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన ముగ్గురు అభ్యర్ధుల పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబుతో భేటీ వేళ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి.

ఇద్దరి కీలక భేటీ
పాలనా పరంగా - రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సమావేశం కానున్నారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు సీఎం నివాసంలో ఈ భేటీ ఆసక్తి కరం గా మారింది. ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపిక పైన ఈ ఇద్దరు చర్చించనున్నారు. మూడు పార్టీలకు ఒక్కో సభ్యుడి ప్రతిపాదనలో మార్పులు జరిగాయి. రాజీనామా చేసిన ఇద్దరిలో బీదా మస్తానరావు టీడీపీ నుంచి, ఆర్ క్రిష్ణయ్య బీజేపీ నుంచి తిరిగి ఎన్నిక కావటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మూడో సీటు కోసం టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ ఉంది.

DY CM Pawan Kalyan to discuss with CM Chandra Babu over probe on Rice smuggling

రాజ్యసభకు వెళ్లేదెవరు
దీంతో, జనసేన నుంచి నాగబాబు ఎంపిక పైన డైలమా కొనసాగుతోంది. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్ధుల పైన తుది నిర్ణయానికి రానున్నారు. అదే విధంగా పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ అంశాల పైన సీఎం కు వివరించనున్నారు. కాకినాడలో బియ్యం అక్రమ రవాణా అంశం పైన పవన్ సీరియస్ గా స్పందించారు. రవాణా చేస్తున్న షిప్ ను సీజ్ చేయాలని అక్కడే ఆదేశించారు. ఈ వ్యవహారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బియ్యం పోర్టుల నుంచి విదేశాలకు తరలి వెళ్తుందని గుర్తించారు. దీంతో, బియ్యం అక్రమ రవాణా.. దీని వెనుక ఉన్నసూత్రధారులను గుర్తించేందుకు విచారణ చేయించాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.

బియ్యం పై విచారణ
ఇప్పుడు చంద్రబాబుతో భేటీ సమయంలో పవన్ తన డిమాండ్ మరోసారి ప్రస్తావించనున్నారు. అదే విధంగా చంద్రబాబు సైతం బియ్యం మాఫియా విషయంలో కఠినంగా ఉంటామని ఇప్పటికే ప్రకటన చేసారు. దీంతో, ఇప్పటి వరకు జరిగిన అక్రమ రవాణా పైన విచారణకు ముఖ్యమంత్రి సీఐడీ కి ఈ వ్యవహారం అప్పగించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రేపు (మంగళవారం) ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనూ పథకాల పైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రాష్ట్రంలో మరో రెండు పథకాలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్దిక నిర్వహణ..పథకాల అమలు పైన చంద్రబాబు - పవన్ భేటీలో చర్చించి.. రేపు జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో, ఇప్పుడు ఈ ఇద్దరి భేటీ పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+