గేరు మార్చిన పవన్, త్రిశూల వ్యూహం - ఇక జనంలో..కీలక మలుపు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలోపేతం పైన డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ చేసారు. తాజాగా పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్రిశూల వ్యూహం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని పవన్ నిర్దేశించారు. అదే సమయంలో జిల్లా పర్యటనలకు పవన్ సమాయత్తం అవుతున్నారు. మారుతున్న సమీకరణాల వేళ పవన్ తాజా నిర్ణయం కీలక మలుపుగా మారుతోంది.

డిప్యూటీ సీఎం పవన్ స్పీడు పెంచారు. కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని నిర్ణయించారు. దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసారు. పార్టీ డిసైడ్ చేసిన విధంగా కార్యాచరణ ప్రతీ ఒక్కరూ అమలు చేయాలని ఆదేశించారు.

Dy CM Pawan key directions for party leaders on up coming local body Elections

పార్టీ శాసన సభ పక్ష సమావేశంలో పవన్ కీలక అంశాలను ప్రస్తావించారు. పాలన, రాజకీయపరమైన అంశాలపై పవన్‌ వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని సూచించారు. జనసైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలని... వారితో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని నిర్దేశించారు.

అదే విధంగా ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతోంది, యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం తదితర విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. రహదారుల కల్పన, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని పవన్ పేర్కొన్నారు. ఒక్కోఅంశంపై ఒక్కో కమిటీ వేసుకుందాం.

ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు నివేదికలు అందించాలని పవన్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం నిరూపించుకునేందుకు గట్టిగా పని చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బలం ఉన్న నియోజకవర్గాల్లోనూ పొత్తు ధర్మం ప్రకారం పోటీకి దూరంగా ఉన్నామని అక్కడి జనసేన కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్దేశించారు. యువతకు, కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వాలని పవన్ కల్యాణ్​ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+