పులివెందుల ఫలితం పై పవన్, ఢిల్లీ రిపోర్ట్..!?

ఏపీలో పులివెందుల ఫలితం సంచలనంగా మారింది. దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. గెలిచింది జెడ్పీటీసీ బై పోల్ అయినా..టీడీపీ ఈ విజయాన్ని బాగా ఆస్వాదిస్తోంది. జగన్ ను సొంత నియోజకవర్గంలో ఓడించాలి అనే లక్ష్యాన్ని టీడీపీ సాధించింది. అయితే.. ఇది కూటమి విజయమా.. టీడీపీ గెలుపా అనేది ఆసక్తి కర చర్చగా మారుతోంది. పులివెందుల ఎన్నిక ప్రారంభం నుంచి పవన్ జోక్యం చేసుకోలేదు. బీజేపీ మూడ్ ఏంటి.. ఏం జరుగుతోంది.

టీడీపీ విజయంతో
జగన్ ఇలాకాలో టీడీపీ విజయం సాధించింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలను సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తొలి నుంచి టీడీపీ, వైసీపీ హోరా హోరీగా తలపడ్డాయి. పోలింగ్ నాడే వైసీపీ చేతులెత్తేసింది. పరోక్షంగా టీడీపీ గెలుపు ఖాయమనే సంకేతాలు ఇచ్చింది. అసలు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది. అసలైన ప్రజస్వామ్యం పులివెందులలో ఈ ఎన్నిక సమయంలోనే కనిపించిందని టీడీపీ వాదిస్తోంది. ఇక, ఫలితాల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీ ని డిపాజిట్ రాకుండా ఓడించాలనే లక్ష్యం నెరవేరింది. ఈ ఎన్నికలో టీడీపీకి 6735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి.

Dy CM Pawan so far not reacts on TDP win in Pulivendula ZPTC elections why

మిత్రపక్షాలు ఎక్కడ
అదే విధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి - 6351 రాగా.. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి - 12505 వచ్చాయి. ఫలితంగా టీడీపీ 6154 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక.. ఈ రెండు ఎన్నికల్లో కూటమిగా కంటే.. టీడీపీ సింగిల్ గానే పోటీ చేసినట్లుగా స్పష్టం అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సమయం నుంచి బీజేపీ.. జనసేన ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం పులివెందుల ఎన్నికలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మినహా పార్టీ అగ్ర నేతలు ఎక్కడా స్పందించలేదు. అదే విధంగా జనసేన నేతలు ఈ ఎన్నికల కోసం యాక్టివ్ గా కనిపించలేదనే వాదన ఉంది.

dy-cm-pawan-so-far-not-reacts-on-tdp-win-in-pulivendula-zptc-elections-why

పవన్ మౌనం - ఢిల్లీ ఆరా
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల ప్రారంభం నుంచి పవన్ తో సహా జనసేన నేతలు ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు. ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎన్నిక గానే జనసేన భావించినట్లు కనిపిస్తోంది. పులివెందులలో పోలింగ్ నాడు చోటు చేసుకున్న ఘటనలు.. వచ్చిన ఆరోపణల కారణంగానే పవన్ ఈ ఓటింగ్ నాడు వచ్చిన విమర్శలపైన స్పందించలేదనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. అటు పులివెందులలో పోలింగ్ నాడు చోటు చేసుకున్న ఘటనల పైన బీజేపీ నాయకత్వం సైతం ఆరా తీసినట్లు సమాచారం. జగన్ సొంత నియోజకవర్గంలో గెలవాలనే సొంత లక్ష్యంతో టీడీపీ పని చేసిందనే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది. దీంతో, తరువాతి రోజుల్లో పులివెందుల ఎన్నిక.. పరిణామాలు.. ఫలితం పైన ఎలాంటి చర్చ చోటు చేసుకుంటుందనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+