తెలంగాణలో మే 14న ఎంసెట్: ఏపీ స్టూడెంట్స్ రాయొచ్చు.. కానీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25న నోటిఫికేషన్, మే 14న పరీక్ష ఉండనుంది. జేఎన్టీయూ ఎంసెట్ పరీక్ష నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఎంసెట్ పరీక్ష రాయవచ్చునని తెలిపారు. అయితే, ఏపీలో పరీక్ష కేంద్రాలు ఉండవని, తెలంగాణకు వచ్చి రాయాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇంటర్‌కు ముందు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు.
తెలంగాణలో ఎంసెట్‌లో ఓపెన్ కేటగిరీలో పదిహేను శాతం సీట్లు ఉంటాయని తెలిపారు. హైదరాబాదులో ఎనిమిది సెంటర్లు, ఇతర జిల్లాల్లో 12 సెంటర్లు ఉంటాయని తెలిపారు.

ఈ నెల 25న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల.
ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు
ఏప్రిల్ 15వ తేదీ వరకు రూ.500 ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు
ఏప్రిల్ 22వ తేదీ వరకు రూ.1000 ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు
మే 5వ తేదీ వరకు రూ.5000 ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు
మే 12వ తేదీ వరకు రూ.10000 ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు
ఏప్రిల్ 15 నుండి 20 వరకు దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకోవచ్చు.
మే 8 నుండి 12 వరకు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మే 28న ర్యాంకులను ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications