ఘోరం: తెల్లవారుజామునే.. బూటుకాళ్లతో తన్నులు.. పిడిగుద్దులు..
ఆక్వా ఫుడ్ పార్కు ఫ్యాక్టరీ నిర్మాణ సామగ్రి తరలింపును ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకుంటారనే సమాచారంతో ముందుగానే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కె.బేతపూడి,
ఏలూరు: శుక్రవారం తెల్లవారుజాము 5 గంటలు కావస్తోంది.. వందలాది మంది పోలీసులు బిలబిలమంటూ వాహనాల్లోంచి దిగారు.. గ్రామస్తుల ఇళ్ల తలుపులు తట్టి దొరికినోళ్లను దొరికినట్లు లాక్కెళ్లారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన వారిని వచ్చినట్లు వాహనాల్లోకెక్కించి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
ఇదేంటని ప్రశ్నించిన వారిపై పిడిగుద్దులు కురిపించారు.. మహిళలని కూడా చూడకుండా బూటుకాళ్లతో తంతూ ఈడ్చి పడేశారు.. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కె.బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో చోటుచేసుకుంది.

గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఫ్యాక్టరీ నిర్మాణ సామగ్రి తరలింపును ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకుంటారనే సమాచారంతో ముందుగానే పోలీసులు ఈ గ్రామాల్లో ఇలా భయానక వాతావరణం సృష్టించారు.
గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించొద్దంటూ మూడేళ్లుగా తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగరువు.. పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం యాజమాన్యం గురువారం యంత్ర సామగ్రిని తరలించాలనుకుంది. ప్రభుత్వం కూడా గ్రామస్తుల నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు గురువారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది పోలీసులను అక్కడికి తరలించింది.
దీంతో పోలీసులు ముందుగానే మెగా ఆక్వాఫుడ్ పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నేతలు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, సముద్రాల వెంకటేశ్వరరావు తదితరులను అరెస్ట్ చేసి మొగల్తూరు స్టేషన్‌కు తరలించారు.
ఇది అన్యాయమంటూ ఆందోళన కారులు పోలీసుల వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా వారిపై పిడిగుద్దులు కురిపించారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వ్యాన్లలో ఎత్తిపడేశారు. మొత్తానికి ఆందోళనకారులందరినీ బలవంతంగా అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications