ఏపీలోని రెండు జిల్లాలో భూ ప్రకంపనలు, జనం పరుగులు: జపాన్‌లో భారీ భూకంపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెల్లకూరు మండలాల్లో భూమి కంపించింది. మరోవైపు, తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఈ ప్రాంతంలో రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెండు మూడు సెకన్లపాటు నేల కంపించడంతో భయంతో బయటికి వచ్చామని ప్రజలు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు ఈ భూ ప్రకంపనలపై ఆరా తీశారు. స్వల్ప ప్రకంపనలే కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

జపాన్‌లో భారీ భూకంపం
జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. భూకంప కేంద్రం ఫుకుషిమా ప్రిఫెక్చర్ తీరంలో గుర్తించారు. దీంతో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఫుకుషిమా ప్రాంతానికి అలర్ట్ జారీ చేశారు.
Earthquake of Magnitude:6.0, Occurred on 14-03-2024, 20:44:38 IST, Lat: 37.20 & Long: 141.00, Depth: 68 Km ,Location: 208km NE of Tokyo, Japan for more information Download the BhooKamp App https://t.co/CVzgAA4Uid@KirenRijiju @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/3mugSwH0RL
— National Center for Seismology (@NCS_Earthquake) March 14, 2024
అయితే, ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని చెప్పారు. ఒక్కసారిగా భూకంపం చోటు చేసుకోవడంతో ప్రజలు నివాసాలు, కార్యాలయాల నుంచి బయటికి పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications