ఉత్తరాంధ్రకు శుభవార్త వినిపించిన కేంద్రం
వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగానే అధిక సంఖ్యలో రైళ్లను భారతీయ రైల్వే నడిపిస్తుంది. అయితే వేసవి తర్వాత అదే రద్దీ కొనసాగుతుంటే మరికొన్ని రోజులపాటు వీటిని పొడిగిస్తుంది. ఏయే మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది? ఎక్కడెక్కడ టికెట్లద్వారా అత్యధిక ఆదాయం వస్తుంది? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని వీటిని తిప్పుతుంది. తాజాగా విశాఖపట్నం-సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. తూర్పు కోస్తా రైల్వే ఆధ్వర్యంలో ఇవి నడవనున్నాయి.
సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్ ప్రెస్
08502/ 08501, 08506 /08505 నెంబర్లతో నాలుగు ట్రిప్పుల ప్రత్యేక రైళ్లుగా నడిపించాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక రైలు 08502 విశాఖ-సంత్రగచ్చి బుధ, శుక్రవారాల్లో 19, 21, 26 28 జూన్-2024 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాతరోజు మధ్యాహ్నం 3.25 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08501 సంత్రాగచ్చి-విశాఖ ప్రత్యేక రైలు గురు, శనివారాల్లో అంటే 20, 22, 27 29 జూన్- 2024 తేదీల్లో సాయంత్రం 5.00 గంట లకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్ పూర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది.

విజయవాడ-విశాఖపట్నం రద్దీని నివారించొచ్చు
రోజురోజుకు భారతీయ రైల్వే రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటిని తిప్పుతున్నారు. అయితే రైళ్ల సంఖ్య పెరుగుతుండటంతో పట్టాలపై వీటి రద్దీ ఎక్కువవడంతోపాటు స్టేషన్లలో ఆగేందుకు సిగ్నల్ లభించక గంటల తరబడి స్టేషన్ బయటే ఎదురుచూడాల్సి వస్తోంది. దీనికి విరుగుడుగా అత్యంత రద్దీ ఉన్న మార్గాల్లో డబుల్ లైన్ తోపాటు త్రిబుల్ లైన్ నిర్మాణాలను భారతీయ రైల్వే చేపట్టింది. ఏపీలో విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-గూడూరు మధ్య మూడోలైను నిర్మాణ పనులు పూర్తికావొస్తున్నాయి. గూడూరు నుంచి రేణిగుంటు, తిరుపతి, బెంగళూరు, చెన్నై వైపు వెళ్లొచ్చు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, కోల్ కతా వెళ్లొచ్చు. అలాగే విశాఖ-విజయవాడ మధ్య రద్దీని నివారించినట్లవుతుంది.












Click it and Unblock the Notifications