విశాఖపట్నంపై వరాల జల్లు కురిపించిన నరేంద్రమోడీ
వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. పుణె టు భువనేశ్వర్, భువనేశ్వర్ టు పుణె, సిఎస్ఎంటి ముంబయి టు భువనేశ్వర్, భువనేశ్వర్ టు సిఎస్ఎంటి ముంబయి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఈ విషయాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైల్వే వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లను ఆధునికీకరించడంతోపాటు రైళ్లల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు.
పుణె టు భవనేశ్వర్ వేసవి ప్రత్యేక రైలు శనివారం ఉదయం 11.30 గంటలకు పూణెలో బయలు దేరి తర్వాతరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడినుంచి బయలుదేరి 16.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. అలాగే భువనేశ్వర్ టు పూణె వేసవి ప్రత్యేక రైలు ఈనెల 1 ఆదివారం 21.25 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరుతుంది. మంగళవారం ఉదయం 5.30 గంటలకు పుణె చేరుకుంటుంది. ముంబయి-భువనేశ్వర్ ప్రత్యేక రైలు 11వ తేదీ శనివారం 11.05 గంటలకు బయలుదేరి సోమవారం రాత్రి 1.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 13వ తేదీ సోమవారం రాత్రి 11.00 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ముంబయి చేరుకుంటుంది.

విశాఖపట్నం టు చెన్నై ఎగ్మోర్ వేసవి ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 17.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మంగళవారం ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. మొత్తం 6 ట్రిప్పులు తిరుగుతుంది. తిరుగు ప్రయాణంలో చెన్నైఎగ్మోర్ టు విశాఖపట్నం వేసవి ప్రత్యేకరైలు ఈనెల 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం ఉదయం 10.30 గంటలకు చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరి బుధవారం అర్థరాత్రి 1.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విశాఖపట్నం రైల్వే డివిజన్ జనరల్ మేనేజర్ కోరారు. ప్రత్యేక రైళ్లను ఆలస్యంగా నడపడంలేదని, అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయని వెల్లడించారు.












Click it and Unblock the Notifications