Crime News: ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు.. ఎందుకంటే..!
అబ్బాయిలే కాదు ఈ మధ్య కొంత మంది అమ్మాయిలు కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. దొంగతనలు చేస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువతి ప్రేమించిన యువకుడినే అంతమొందించింది.
ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.జిల్లాలోని గోకవరం మండలం తిరుమలపాలెం ఊరుకు చెందిన నాగేష్ అనే వ్యక్తి రాజమహేంద్రవరంలో చదువుతున్నప్పడు రంపచోడవరం మండలం చీలకవీధికి చెందిన కుర్ల డెబొరతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

వీరిద్దరు నాలుగేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే నాగేష్ చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. అతనికి కుటుంబ సబ్యులు సంవత్సరం క్రితం గొల్లప్రోలుకు చెందిన ఓ అమ్మయితో పెళ్లి చేశారు. నాగేష్ కు పెళ్లైన వియషం డెబొరకు తెలియదు.
అయితే నాగేష్ ఫోన్ చేయడం తగ్గించడంతో పాటు రాజమహేంద్రవరం రావడం కూడా తగ్గించాడంతో ప్రియురాలికి అనుమానం వచ్చింది. నగేష్ గురించి విచారించగా.. ఏడాది క్రితమే వివాహం అయినట్లు తెలిసింది.
దీంతో నాగేష్ కు ఫోన్ చేసింది. అతడిని కలిసి గొడవపడింది. అనంతరం నాగేష్ ను తన స్నేహితుడు శివన్నారాయణ గ్రామమైన రాజవొమ్మంగి మండలం దూసరపాముకు తీసుకెళ్లింది. బుధవారం రాత్రి నాగేష్ బిల్డింగ్ పై నిద్రిస్తుండగా అతని వద్ద వెళ్లిన ప్రియురాలు గొడవ పడింది. తనతో తెచ్చుకున్న కత్తి పీటతో నాగేష్ పై దాడి చేసింది. శివన్నారాయణ నాగేష్ తలపై కర్రతో కొట్టాడు. దీంతో నాగేష్ అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు.
కానీ అప్పటికే నాగేష్ ప్రియురాలు, యువకుడు తప్పించుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నాగేష్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications