వరి అన్నం వివాదం: అప్పుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబు.. తెలంగాణాను కించపరిచారా?
తెలంగాణలో అన్నం తినే అంశం ఇప్పుడు తెలంగాణలో వివాదంగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబు తెలంగాణను అవమానించారని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలు టీడీపీ అధికారంలోకి వచ్చాకే అన్నం తిన్నారు అన్నట్టు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణాను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ వినిపిస్తుంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం చంద్రబాబు ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో అదేవిధంగా వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నిజంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తెలంగాణను కించపరిచే వ్యాఖ్యలు చేశారా? ఎందుకు ఇంతగా వారిని టార్గెట్ చేశారు?

తెలంగాణా వరి అన్నంపై చంద్రబాబు వ్యాఖ్యలు
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. చంద్రబాబు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు వరి బియ్యం ఆహారంగా తీసుకోవడం ప్రారంభించారంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆహారపు అలవాట్ల పై వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రారంభించిందని, ఆ తర్వాతే తెలంగాణా జనం బియ్యం అన్నం తినడం ప్రారంభించారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుపై దాడికి దిగిన మంత్రులు, తెలంగాణా వాదులు
ఇక ఇది తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను కించపరచడమేనని చంద్రబాబుపై మంత్రులు దాడికి దిగారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని మంత్రి నిరంజన్ రెడ్డి. టిడిపి వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు అన్నం తిన్నారా అని చెప్పడం అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక నిరంజన్ రెడ్డి మాత్రమే కాదు తెలంగాణ ప్రాంత నాయకులు, తెలంగాణా వాదులు చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు
ఇక గతంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తరహా వ్యాఖ్యలను చేశారు. గతంలో ఒక పొలిటికల్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసి తెలంగాణ ప్రాంతంలో వరి పెద్దగా పండక పోవడం వల్ల ఇక్కడి ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు మాత్రమే తినే వారని, ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారో అప్పుడు తొలిసారి అన్నం తిన్నారని గద్దర్ తనకు చెప్పినట్టు పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఇక్కడ జనాలు దేవుడిలా చూడడానికి కారణం ఇదేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ పైనా ట్రోల్స్ .. తెలిసి కూడా చంద్రబాబు తాజా వ్యాఖ్యలు
ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణను కించపరచడానికి చేసిన వ్యాఖ్యలేనని అప్పట్లో తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఇక ఈ విషయం చంద్రబాబుకు తెలిసి కూడా తాజాగా చంద్రబాబు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మళ్లీ దుమారం రేపింది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ వరి అన్నం వివాదం తో రచ్చ చేస్తున్నారు తెలంగాణ వాదులు.

సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే సున్నితమైన అంశాల విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఏ చిన్న అంశం దొరుకుతుందా టార్గెట్ చేయడానికి అని చూస్తున్న ప్రత్యర్థి వర్గాలు పనిగట్టుకుని మరీ దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు రాజకీయ నాయకులు ఎవరు ఏది మాట్లాడినా సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications