నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల ఉపఎన్నిక: స్టార్ క్యాంపెయినర్ల ఖర్చు పితలాటకం, ఈసీ కొరడా, టీడీపీ కొంప కొల్లేరే!

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని యధేచ్చగా అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి షాక్ తగిలింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని యధేచ్చగా అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి షాక్ తగిలింది. నిబంధనలను పట్టించుకోకుండా టీడీపీ చేసిన చిన్న తప్పే ఆ పార్టీ పాలిట శాపంగా మారబోతోంది.

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరఫు ప్రచారం నిర్వహించిన స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చును పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి ఖర్చు కిందే లెక్కయనుంది తెలుగుదేశం పార్టీ. కానీ ఇది నిబంధనలకు విరుద్ధం.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 77 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు చేయొచ్చు. అభ్యర్థి తరఫు ప్రచారం నిర్వహించే వారి ప్రచారానికి అయ్యే ఖర్చుకు, అభ్యర్థి తన ప్రచారానికి చేసే ఖర్చుకు ఎలాంటి సంబంధం ఉండదు. అంతేకాదు, అభ్యర్థి తరఫున ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారో.. వారందరి పేర్లను ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన వారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాల్స ఉంటుంది.

టీడీపీ చేసిన తప్పేమిటంటే..

టీడీపీ చేసిన తప్పేమిటంటే..

నంద్యాల ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన వారం రోజుల్లోగా తమ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారన్న వివరాలను ఈసీకి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అందించలేదు. నోటిఫికేషన్‌ వెలువడిన రెండు వారాల తర్వాత ప్రచారానికి వెళ్లే స్టార్ క్యాంపెయినర్ల వివరాలను ఆ పార్టీ ఈసీకి పంపింది.
దీంతో ఉప ఎన్నికలో భాగంగా ప్రచారం నిర్వహించిన స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చులను భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ఖర్చు కింద ఈసీ లెక్కయనుంది.

Recommended Video

Nandyal Bypoll : Huge Money offered to Voters to Buy Votes| Oneindia Telugu
కోర్టుకు వెళ్లే అవకాశం?

కోర్టుకు వెళ్లే అవకాశం?

ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు దాటకూడదనేది నిబంధన. ఈ లెక్క ప్రకారం.. ఒక వేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా.. దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన స్టార్‌ క్యాంపెయినర్లలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కమెడియన్‌ వేణు మాధవ్‌, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

ముందే జాగ్రత్త పడిన వైసీపీ...

ముందే జాగ్రత్త పడిన వైసీపీ...

వైసీపీ మాత్రం.. ఈ విషయంలో ముందే జాగ్రత్త పడింది. తమ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి తరఫు నంద్యాలలో ప్రచారం నిర్వహించనున్న 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్ల జాబితాను ఆగస్ట్‌ 2వ తేదీనే ఎన్నికల కమిషన్‌కి పంపింది. దీంతో వైసీపీకి ఇలాంటి సమస్య లేదు.

English summary
Is Election Commission is going to take action against TDP regarding Nandyal Byelection? The answer is 'YES' for this question. According to the sources.. TDP committed a mistake regarding the submission of the Star Campaigners Expenses during the Nandyal Bypoll to the EC. According to the rules MLA Candidate can show his election campaign expenses upto Rs.28 Lakhs. If any party wants to use Star Campaigners, they have to give list of the campaigners with in a week of time after releasing of the election notification. Here TDP is not submitted their list of star campaigners to EC within time. So, TDP is going to face the consequences of the wrong done by them in this bypoll. YCP has a chance to go to court on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X