AP Liquor: ఎన్నికల వేళ ఏపీలో మందుబాబులకు షాకులు..!
ఏపీలో ఎన్నికల వేళ మద్యం ప్రలోభాల్ని అరికట్టేందుకు ఈసీ కఠిన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండటంతో ఆ మేరకు అమ్మకాలపై ఆంక్షలు విధిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులకు సూచనలు చేస్తోంది. దీంతో వారు కూడా క్షేత్రస్ధాయిలో మద్యం అమ్మకాలపై నిఘా పెట్టారు. ఇదంతా అంతిమంగా మందుబాబులకు చుక్కలు చూపిస్తోంది.
రాష్ట్రంలో పరిమితికి మించి మద్యం అమ్మకాలను నియంత్రించాలంటూ ఎక్సైజ్ అధికారులకు ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు మద్యం షాపుల్లో అమ్మకాలపై గట్టి నిఘా పెట్టారు. పరిమితికి మించి మద్యం అమ్మితే సదరు షాపుల్ని మూయించేస్తున్నారు. దీంతో మద్యం షాపులతో పాటు మందుబాబులకూ షాకులు తప్పడం లేదు. ఇవాళ రాత్రి తెరిచి ఉన్న మద్యం షాపులు తెల్లారే కల్లా మూతపడుతుండటంతో మందుబాబులు అవాక్కవుతున్నారు.













Click it and Unblock the Notifications