మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో ఈడీ దాడులు; గుంటూరులోనూ కొనసాగుతున్న రైడ్స్; ఎందుకంటే!!
ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీ డైరెక్టర్లు, ఇళ్ళు కార్యాలయాలలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈడీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివరావుని టార్గెట్ గా చేసుకుని ఈడి దాడులు కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్లో ఉన్న ఆయన కంపెనీల కార్యాలయాలతో పాటు, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈడి దాడులు కొనసాగుతున్నాయి. అంతేకాదు గుంటూరులోని ఆయన ఇల్లు, కార్యాలయాల పైన కూడా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు.
దాదాపు 13 బ్యాంకుల నుంచి తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలను తీసుకొని, ఈ బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి రుణాలను షెల్ కంపెనీలకు తరలించారని సిబిఐ గతంలో వీరిపై కేసు నమోదు చేసింది. ఇక సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ వ్యవహారం ఉందని, ఈడీ కేసు నమోదు చేసిన అధికారులు నేడు రంగంలోకి దిగారు.

ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు టార్గెట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాడులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 27 లో రాయపాటి నివాసంతో పాటు, గుంటూరులోనూ ఈడీ అధికారులు తనిఖీలు సాగిస్తున్నారు. ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీ బ్యాంకు ఖాతాల నుండి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్ కు నగదు బదిలీ అయినట్టుగా ఈడి అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. బ్యాంకు కరుణాల ఎగవేత పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన క్రమంలో గుంటూరు తో పాటు తొమ్మిది చోట్ల ఈడి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో 2019 డిసెంబర్లో రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై సిబిఐ అధికారులు దాడులు చేశారు.
ఆ సమయంలో హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు లలో ఏకకాలంలో దాడులు చేశారు. ఇప్పుడు మళ్లీ భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈడి అధికారులు రంగంలోకి దిగి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లోను, ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకి సంబంధించిన కీలక వ్యక్తులైన మాలినేని సాంబశివరావు రావుతో పటు పలువురి ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ దాడులు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications