3 నెలల్లో పనులు ప్రారంభించకపోతే భూములు వెనక్కి: లోకేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు తెలుగుదేశం పార్టీవైపే ఉన్నారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చెప్పారు.2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఏపీసీటీటీ వర్క్‌షాప్‌ను ఆదివారం నాడు మంత్రి లోకేష్ విశాఖలో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.అలాగే సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా ఉందన్నారు.

eighty percent people with tdp in Andhra pradesh: Nara Lokesh

ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ ఆకట్టుకుందని మంత్రి లోకేష్ చెప్పారు. . రుషికొండ ఐటీ హిల్‌లో కంపెనీలు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు మంత్రి లోకేష్.

3 నెలల్లోగా పనులు పూర్తి చేయకపోతే భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి ఆయా కంపెనీలను హెచ్చరించారు. . టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా ఐటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

లోకేష్ డైనమిక్ మినిష్టర్

ఐటీ మంత్రి నారా లోకేష్‌ను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రశంసించారు. స్మార్ట్ అండ్ డైనమిక్ మినిస్టర్ అంటూ లోకేష్‌పై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశంసలు కురిపించారు. విశాఖపట్టణం పరిశ్రమలకు, పెట్టుబడులకు అనుకూలమన్నారు విష్ణుకుమార్‌రాజు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
eighty percent people with tdp in Andhrapradesh said Ap minister Nara Lokesh in Vishakatanam on Suday. Minister Lokesh participated in Apctt workshop held at Vizag.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X